Modi Posters: నిజామాబాద్ జిల్లాలో మంచిప్పలో పోస్టర్ల కలకలం సృష్టించాయి. మోడీ పర్యటన నేపథ్యంలో గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. ఓట్ల కోసం మా ఇళ్ల కు రావొద్దంటు మంచిప్ప రిజర్వాయర్ నిర్వాసితులు ప్రతి ఇంటికి పోస్టర్లు అతికించుకున్నారు. రీ డిజైన్ రద్దు చేస్తే మా గ్రామాలకు రావాలని అందులో పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకులను ముంపు గ్రామాలకు రానివ్వం అంటూ పోస్టర్లు వెలియడంతో సంచలనంగా మారింది. అయితే అధికార పార్టీ నేతలు గ్రామాలకు రావొద్దంటు వేసిన పోస్టర్ల పై పోలీసుల సీరియస్ అయ్యారు. ముంపు గ్రామ కమిటీ సభ్యులను అరెస్ట్ చేస్తున్నారు. దీంతో మంచిప్పలో ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. పోలీస్ వాహనాలకు గ్రామస్థులు అడ్డుపడ్డారు. ఒకరినొకరు వాగ్యవాదం చోటుచేసుకుంది. ముంపు గ్రామస్థులు పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. మంచిప్ప పర్యటనకు రూరల్ ఎం.ఎల్.ఏ. బాజి రెడ్డి సిద్ధమవడంతో.. పోలీసులు అప్రమత్తమయ్యారు.
తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనకు ముందు కొన్ని పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో మోడీకి వ్యతిరేకంగా పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. తెలంగాణలో పర్యటించే హక్కు మోదీకి లేదంటూ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ ఆవిర్భావాన్ని పదే పదే అవమానిస్తూ గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు అంటించారని.. తెలంగాణలో పర్యటించే నైతిక హక్కు మోదీకి లేదన్నారు. తెలంగాణ ఏర్పాటుపై పలు సందర్భాల్లో మోదీ పార్లమెంటులో మాట్లాడుతున్న పోస్టర్లు ఉన్నాయి. బిడ్డను కాపాడేందుకే తల్లిని హత్య చేశారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ పోస్టర్లు అంటించారు. ప్రధాని మోదీ ఇవాళ మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో వెలిసిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి.
శంషాబాద్ విమానాశ్రయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి వినూత్న స్వాగత పోస్టర్లు వెలశాయి.. What happened modi అంటూ ఎయిర్ పోర్ట్ పరిసరా ప్రాంతాల్లో పోస్టర్లు వెలిశాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఏది? అంటూ ప్రశ్నించారు. పసుపు బోర్డు ఎక్కడ …..? అంటూ.. మీ హామీలు అన్ని నీటి ముఠా లేనా అంటూ ప్లెక్సీలు వెలిశాయి. రావణాసురుడు తలతో మోడీ బ్యానర్ ఏర్పాటు చేశారు. ఐటిఐఆర్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, టెక్ష్ట్స్ టైల్ పార్క్,డిఫెన్స్ కారిడార్ ,మిషన్ భగీరథ నిధులు,గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డ్ ఎక్కడ అంటూ రావణాసురుడు తలలా మోడీ బ్యానర్ ఏర్పాటు చేశారు. మోడీ వినూత్న స్వాగత పోస్టర్లను శంషాబాద్ విమానాశ్రయంకు వచ్చే ప్రయాణికులు ఆసక్తిగా చూస్తున్నారు.
Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్‌న్యూస్.. నేడే సైకిల్ ట్రాక్ ప్రారంభం