వచ్చే ఎడాది దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం అన్నిపార్టీలు ఇప్పటి నుంచే సిద్దం అవుతున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతున్నది. అధికారపార్టీ చేసిన తప్పులను ఎత్తి చూపి అధికారంలోకి రావాలని చూస్తున్నాయి ప్రతిపక్షపార్టీలు. బీజేపీకి అనుబంధంగా పనిచేస్తున్న ఆర్ఎస్ఎస్ ఇప్పుడు యూపీపై దృష్టి సారించింది. ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన భగత్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లికీ మరికొంత మంది ఆర్ఎస్ఎస్ ముఖ్యనేతలు రాబోతున్నారు. […]
దేశంలో పుత్తడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో పుత్తడిని కొనుగోలు చేసేవారి సంఖ్య అధికం. కరోనా కారణంగా వివాహాలు పెద్దగా హడావుడి లేకుండా సింపుల్‌గా జరుగుతున్నాయి. భారీగా వివాహాం చేసుకోవాలి అనుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు. కరోనా ప్రభావం బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధర ఇప్పటికే రూ.50 వేలు దాటింది. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10 […]
మేషం : వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి. దైవ, సేవా, కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. గృహ నిర్మాణాలు, మరమ్మతులు ఒక కొలిక్కి రాగలవు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అవివాహిత యువకులకు అందిన ఒక సమాచారం. నిరుత్సాహం కలిగిస్తుంది. వృషభం : ఆస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. విదేశీయాన యత్నాలు నెరవేరగలవు. కాంట్రాక్టులకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి. ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం. అందుకుంటారు. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి. నిరుద్యోగ […]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ స్థాయిలో వణికిస్తున్నదో చెప్పాల్సిన అవసరంలేదు. కరోనా కారణంగా ఇప్పటికే లక్షలాది మంది మృత్యువాత పట్టారు. కోట్లాదిమందికి వైరస్ సోకింది. కరోనా మహమ్మారిని అదపుచేసే విషయంలో చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కరోనాను కంట్రోల్ చేయలేక అనేక దేశాలకు చెందిన మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. కరోనాతో అతలాకుతలమైన బ్రెజిల్ దేశం ఏకంగా ఆరోగ్యశాఖకు నలుగురు మంత్రులను మార్చింది. అయినా కరోనాను కంట్రోల్ చేయడంతో విఫలం అవుతూ వచ్చింది. మరో […]
కరోనా మహమ్మారి కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. దీంతో అనేక రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు అమలుచేస్తున్నారు. లాక్‌డౌన్ అమలు చేస్తున్న రాష్ట్రాల్లో కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో లాక్‌డౌన్ ను ఎత్తివేయాలని రాష్ట్రాలు చూస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్ ఎత్తివేతపై ఐసీఎంఆర్ కీలక వ్యాఖ్యలు చేసింది. దీనికోసం మూడు అంశాల ప్రణాళికను వెల్లడించింది. తక్కువ పాజిటివిటి రేటు, అత్యధిక మందికి టీకాలు, కోవిడ్ నిబంధనలతో కూడిన ప్రవర్తనల వంటి అంశాలను […]
భారత్ సొంత టెక్నాలజీతో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు భారత్ బయోటెక్ ఫార్మా సంస్థ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌కు తయారు చేసింది. అయితే, అధికమొత్తంలో వ్యాక్సిన ఉత్పత్తి చేసేందుకు కోవాగ్జిన్ సంస్థ ఇండియాలోని మరికొన్ని కంపెనీలకు అనుమతులు మంజూరు చేసింది. మహారాష్ట్రలోని హెచ్.బీ.పీ.సీ.ఎల్ సంస్థ రాబోయో 8 నెలల కాలంలో 22 కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేయబోతున్నట్టు మహారాష్ట్ర ఫార్మా సంస్థ తెలిసింది. వ్యాక్సిన్ ఉత్పత్తికి మహా సర్కార్ రూ.93 కోట్లు, కేంద్రం రూ.65 కోట్లు నిధులను […]
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యక్సిన్ లు రెండు డోసులు వేయాలి. మొదటి వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజులకు సెకండ్ డోస్ తీసుకోవాలి. రెండు డోసుల విధానం వలన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యంగా సాగుతున్నది. దీంతో సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలో కరోనాకు తొలి వ్యాక్సిన్‌ను తయారు చేసిన స్పుత్నిక్ వి సింగిల్ డోస్ ను రెడీ చేసింది. ఇప్పటికే […]
బ్రహ్మంగారి మఠానికి సంబందించి పీఠాధిపతి ఎంపిక కోసం వారసుల మద్య ఆదిపత్యపోరు జరుగుతున్నది. ఈ వివాదం తారాస్థాయికి చేరడంతో వివాదానికి చెక్ పెట్టేందుకు వివిధ మఠాలకు చెందిన పీఠాధిపతులు బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు. శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామితో పాటు పలువురు పీఠాదిపతులు బ్రహ్మంగారి మఠానికి చేరుకున్నారు. ఇక ఇదిలా ఉంటే, ప్రస్తుతం మఠం ఆలయ పరిసర ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. అలయంలోకి ఎవరిని అనుమతించడంలేదు. వారసుల మద్య సయోధ్యను కుదిర్చి పరిస్థతిని చక్కదిద్దేందుకు పీఠాధిపతులు ప్రయత్నం […]
భారత దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న. ఇప్పటి వరకు మొత్తం 48 మందికి భారత రత్న అవార్డులు పొందగా, ఇందులో 14 మందికి మరణానంతరం ఈ అవార్డులు పోందారు. భారత రత్న అవార్డులు పొందిన వారిలో అమర్త్య సేన్ కూడా ఒకరు. ఈ పురస్కారం పోందిన వారికి ఎయిర్ ఇండియా సంస్థ ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఉచిత ప్రయాణం వినియోగించుకున్న వారిలో అమార్త్యసేన్ ముందు వరసలో ఉన్నారు. ఆయన […]
శరీర నిర్మాణంలో విటమిన్ డీ కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరంలేదు. విటమిన్ డి శరీరంలో తగిన పరిమాణంలో ఉంటే, కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొనవచ్చని, కరోనాపై పోరాటానికి విటమిన్ పాత్ర కీలకం అని తెలంగాణ వైద్యబృందం పరిశోధనలో తేలింది. ఆరునెలలపాటు విటమిన్ డి పాత్రపై వైద్యబృందం పరిశోధన చేశారు. పల్స్ ఢీ థెరపీ పేరుతో ఈ పరిశోధన జరిగింది. విటమిన్ డి శ్వాస కోశ వ్యాధుల నుంచి కాపాడుతుందని స్పానిష్ ఫ్లూ సమయంలో […]