చలికాలంలో గడ్డ పెరుగు తినడం మంచిదా కాదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. గడ్డ పెరుగులో ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ B6, విటమిన్ B12 వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే చలికాలంలో చల్లగా ఉండే గడ్డ పెరుగును నేరుగా తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతు ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జలుబు, సైనసైటిస్ వంటి సమస్యలు ఉన్నవారు రాత్రి సమయంలో పెరుగు తినకుండా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
అయితే పెరుగును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో, గది ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాత పెరుగును తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే కొద్దిగా మిరియాల పొడి, అల్లం, జీలకర్ర వంటి వేడి గుణాలు ఉన్న పదార్థాలను పెరుగులో కలిపి తీసుకుంటే చలికాలంలో కూడా దాని వల్ల కలిగే దుష్ప్రభావాలను తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. సరైన సమయంలో, సరైన విధంగా గడ్డ పెరుగు తీసుకుంటే చలికాలంలో కూడా దాని ఆరోగ్య ప్రయోజనాలను పూర్తిగా పొందవచ్చని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
సాధారణంగా పెరుగు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే సరైన సమయంలో, సరైన మోతాదులో తీసుకోకపోతే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో, సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్న పెరుగును తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పై సమాచారం అంతా ఇంటర్నెట్ ద్వారా సేకరించబడింది. ఏవైనా ఆరోగ్య సంబంధిత సందేహాలు ఉంటే తప్పనిసరిగా వైద్యులు లేదా ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.