కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యక్సిన్ లు రెండు డోసులు వేయాలి. మొదటి వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజులకు సెకండ్ డోస్ తీసుకోవాలి. రెండు డోసుల విధానం వలన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆలస్యంగా సాగుతున్నది. దీంతో సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రపంచంలో కరోనాకు తొలి వ్యాక్సిన్‌ను తయారు చేసిన స్పుత్నిక్ వి సింగిల్ డోస్ ను రెడీ చేసింది. ఇప్పటికే రష్యాలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగా, వివిధ దేశాల్లో దీనికి అనుమతులు మంజూరు చేశారు. కాగా, ఇండియాలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంస్థ స్పుత్నిక్ వీ సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనుమతుల కోసం ధరఖాస్తు చేసుకుంది. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. వ్యాక్సిన్‌కు అనుమతులు వస్తే ఇండియాల సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇదే అవుతుంది.