కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ స్థాయిలో వణికిస్తున్నదో చెప్పాల్సిన అవసరంలేదు. కరోనా కారణంగా ఇప్పటికే లక్షలాది మంది మృత్యువాత పట్టారు. కోట్లాదిమందికి వైరస్ సోకింది. కరోనా మహమ్మారిని అదపుచేసే విషయంలో చాలా దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కరోనాను కంట్రోల్ చేయలేక అనేక దేశాలకు చెందిన మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాల్సి వచ్చింది. కరోనాతో అతలాకుతలమైన బ్రెజిల్ దేశం ఏకంగా ఆరోగ్యశాఖకు నలుగురు మంత్రులను మార్చింది. అయినా కరోనాను కంట్రోల్ చేయడంతో విఫలం అవుతూ వచ్చింది. మరో దక్షిణ అమెరికా దేశం అర్జెంటైనాలో కూడా కరోనా మహమ్మారి విజృంభిస్తుంది. కరోనా వ్యాక్సినేషన్ విషయంలో అవకతవలు జరిగాయనే ఆరోపణలు రావడంతో ఆ దేశ ఆరోగ్యశాఖమంత్రి రాజీనామా చేశారు. కరోనాను కట్టడి చేయలేకపోవడంతో జోర్డాన్, పెరూ, ఇరాక్, ఆస్ట్రియా, ఈక్వెడార్, స్లోవాకియా కు చెందిన ఆరోగ్యశాఖ మంత్రులు రాజీనామా చేయగా, మంగోలియాలో ఏకంగా కేబినెట్ మొత్తం రాజీనామాలు చేసింది.