వేగంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటి వరకు కేవలం దేశంలో 4 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ అందించారని, ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మాణిక్యం ఠాగూర్ డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణలోని జిల్లాల్లో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని, 7 వతేదీన గాంధీభవన్ తో పాటు, జిల్లా కేంద్రాల్లో ఉదయం 9గంటల నుంచి మద్యాహ్నం ఒంటిగంత వరకు […]
భారత్‌లో అత్యంత చెడ్డభాష ఏంటి అని గూగుల్‌లో టైప్‌చేస్తే సెర్చ్ ఇంజన్ కన్నడ అని చూపించడంపై కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కన్నడ భాష పురాతనమైన భాష అని, ప్రాచీన భాష హోదా గుర్తింపు ఉందని, అలాంటి ప్రాచీన భాషను చెడ్డభాషగా చూపించడం తగదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని కర్నాటక సాంస్కృతిక శాఖ మంత్రి అరవింద లింబావళి పేర్కొన్నారు. సెర్చ్ ఇంజన్ గూగుల్‌కు నోటీసులు జారీ చేస్తామని కన్నడ అధికారులు చెబుతున్నారు. సామాన్యుల నుంచి కన్నడ […]
మధ్యప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్లు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. సోమవారం నుంచి జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. ఈ సమయంలో సమ్మె కరెక్ట్ కాదని, సమ్మె విరమించాలని మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తు దాదాపుగా మూడు వేలమంది జూనియర్ డాక్టర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేశారు. ఆరు ప్రభుత్వ వైద్యకళాశాల పరిధిలో పనిచేస్తున్న జూనియర్ వైద్యులు రాజీనామాలు చేసి వాటిని కాలేజీ డీన్‌కు అందజేశారు. ప్రాణాంతకమైన కరోనా మహమ్మారి […]
మహిళలు బయట ఎలా ఉన్నా.. చట్ట సభల్లోకి అడుగుపెట్టే సమయంలో మాత్రం సంప్రదాయబద్దంగా దుస్తులు ధరించి వస్తుంటారు. అయితే, సంప్రదాయబద్దంగా కాకుండా బిగుతైన జీన్స్ ధరించి పార్లమెంట్ కు వచ్చినందుకు మహిళా ఎంపీని బయటకు పంపించారు. ఈ ఘటన టాంజానియా పార్లమెంట్‌లో జరిగింది. ఎంపి కండెక్టర్ స్విచాలే బిగుతైన జీన్స్ ధరించి పార్లమెంట్ కు హాజరైంది. సహచర ఎంపీల నుంచి ఫిర్యాదులు అందడంతో స్పీకర్ ఆమెను బయటకు పంపారు. మంచి దుస్తులు ధరించి పార్లమెంట్‌కు హాజరుకావాలని ఆదేశించారు. […]
నాసా మరో సాహసయాత్రకు శ్రీకారం చుట్టింది. అరుణగ్రహంపై ఇప్పటికే పరిశోధనలు చేస్తున్న నాసా ఇప్పుడు దృష్టిని శుక్రగ్రహంమీదకు మళ్లించింది. శుక్రగ్రహంపైకి రెండు వ్యోమనౌకలను పంపించేందుకు సిద్దమైంది నాసా. శుక్రగ్రహంమీద ఉష్ణ్రోగ్రతలు తీవ్రస్థాయిలో ఉంటాయి. సీసం సైతం ఆ వేడికి కరిగిపోతుంది. భూమికి సమీపంలో ఉన్న శుక్రగ్రహంపై ఆ స్థాయిలో ఉష్ణ్రోగ్రతలు ఉండడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునేందుకు నాసా ప్రయోగాలు చేయబోతున్నది. ఈ వేడి గురించి తెలుసుకోవడానికి నాసా రెండు వ్యోమనౌకలను సిద్దం చేస్తున్నది. డావించి, వెరిటాన్ […]
మామూలుగా మనం పాము కనపడితే ఆమడ దూరం పరిగెడతాం. లేదంటే పాములు పట్టుకునే వారికి ఫోన్ చేస్తాం. కానీ, ఆ యువతి మాత్రం అలా చేయలేదు. రోడ్డుపక్కన భయంకరమైన పాము కనిపించగానే వెంటనే దాని తోక పట్టుకుంది. అనంతరం దాని తలను పట్టుకుంది. ఆమె చేతి నుంచి తప్పించుకొని పారిపోయేందుకు పాము శతవిధాలా ప్రయత్నం చేసింది. కానీ, ఆమె దాన్ని వదలలేదు. పైగా పామును బెల్టు మాదిరిగా నడుముకు చుట్టుకొని తనకేమి తెలియదన్నట్టు అక్కడి నుంచి వెళ్లిపోయింది. […]
కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత దానిని తీసుకోవడానికి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే ఎక్కడ ఇబ్బందులు ఎదురౌతాయో అని భయపడుతున్నారు. దీంతో ముందుకు రావడంలేదు. యువతకు వ్యాక్సిన్ వేయించేందుకు అధికారులు, సామాజిక సంస్థలు అనేక తంటాలు పడుతున్నాయి. చెన్నై శివారు ప్రాంతమైన కోవలం గ్రామంలో 14,300 మంది మత్య్సకారులు ఉన్నారు. వీరిలో 18 ఏళ్లకు పైబడిన వ్యక్తులు 6వేలకు పైగా ఉన్నారు. వీరిలో మొదట 58 మంది మాత్రమే టీకా […]
కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది మృత్యువాత పడ్డారు. మరణించిన వ్యక్తులకు సంబందించిన కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. పిల్లలు అనాథలుగా మారుతున్నారు. దీంతో వారిని ఆదుకోవడానికి ప్రభుత్వాలు అనేక రకాల పథకాలు రూపోందిస్తున్నాయి. టాటా సంస్థ తమ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు కరోనాతో మరణిస్తే వారి కుటుంబానికి ఈ వ్యక్తి రిటైర్ అయ్యే వరకూ జీతం అందిస్తామని పేర్కొంది. దీంతో పాటుగా కుటుంబలోని పిల్లల చదువుకు సంబందించిన బాధ్యతను కూడా తీసుకుంటామని తెలిపింది. ఈ బాటలో ఇప్పుడు […]