2014 జూన్ 2 వ తేదీన ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ కోసం ఎందరో పోరాటం చేశారు. ఎందరో ప్రాణ త్యాగం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో తెలంగాణ పోరాటం జరిగింది. తెలంగాణ సాధన తరువాత మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతున్నది. 2018 వ సంవత్సరంలో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మరింత అభివృద్ధి దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నది. 1969 లో తెలంగాణకోసం ఉమ్మడి […]
నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలోకి రావాలంటే తప్పని సరిగా ఆధార్ కార్డ్ తప్పని సరి చేశారు. ఆనందయ్య మందుకోసం ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్తులు తప్ప మరెవరూ గ్రామంలోకి అడుగుపెట్టేందుకు వీలు లేదని, గ్రామస్తుకు కూడా బయట నుంచి గ్రామంలోకి రావాలంటే ఆధార్ కార్డు తప్పని సరి అని పోలీసులు చెబుతున్నారు. కృష్ణపట్నంలో ప్రస్తుతం 144 సెక్షన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు. గ్రామస్తులు తప్ప ఇతరులను గ్రామంలోకి […]
పిల్లలపై తల్లిదండ్రులు కోప్పడటం సహజమే. తిట్టినపుడు పిల్లలు అలుగుతారు. కొంతమంది పిల్లలు ఇంట్లోనుంచి చెప్పకుండా బయటకు వెళ్లిపోతుంటారు. కానీ, స్పెయిన్ కు చెందిన కాంటో అనే యువకుడు కొంత వినూత్నంగా చేసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. 2012లో కాంటోని ట్రాక్ సూట్ వేసుకొని బయటకు వెళ్లొద్దని మందలించారని, పెరట్లో గుహ తవ్వడం మొదలు పెట్టాడు. స్కూల్ నుంచి వచ్చిన తరువాత కూడా ఆ గుహను తవ్వడం చేస్తుండేవాడు. కొన్ని రోజుల తరువాత అతనికి తన స్నేహితుడు […]
ప్రేమించిన అమ్మాయి కోసం తెలుగు యువకుడు దేశాలు దాటి వెళ్లేందుకు కాలి నడకన బయలుదేరి దాయాది దేశం సైనికులకు దొరికిపోయాడు. 2017 నుంచి పాక్ చెరలో ఉన్న తెలుగు యువకుడు ప్రశాంత్ ఇటీవల రిలీజ్ అయ్యి హైదరాబాద్ చేరుకున్నాడు. పాక్ చెర నుంచి క్షేమంగా బయటపడిన ప్రశాంత్ పాక్ జైలు గురించి కీలక విషయాలను తెలియజేశాడు. విచారణ సమయంలో తనను తీవ్రంగా కొట్టారని, ఏడారి ప్రాంతంలో సైనికులకు దొరికిన సమయంలో తనకు మంచి ఆహారం అందించారని ప్రశాంత్ […]
మూడు రోజుల క్రితం వరకూ తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు తిరిగి పెరగడం మొదలు పెట్టాయి. మూడు రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. మూడో రోజు కూడా ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ.46,100కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 పెరిగి 50,300 కి చేరింది. గత మూడు రోజులుగా […]
ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిరాఢంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా వేడుకలను సాదాసీదాగా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు జరుగుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంట తరువాత బయటకు ఎవరూ రాకూడదు అనే సంగతి తెలిసిందే. దీంతో ఉదయం సమయంలోనే వేడుకలను సాదాసీదాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడ వేడుకలు జరిగినా 10 మందికి మించకుండా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది కూడా కరోనా […]
మిజోరాం రాష్ట్రంలో ప్రస్తుతం స్వైన్ ఫ్లూ వేగంగా విస్తరిస్తోంది. ఆఫ్రికన్ ఫ్లూ ధాటికి ఆ రాష్ట్రంలో దాదాపుగా 4800 పందులు మృత్యవాత పట్టాయి. మార్చి 21 వ తేదీన లంగ్‌లై జిల్లాలోని లంగ్‌సేన్ అనే గ్రామంలో మొదటగా ఈ వ్యాధి బయటపడింది. ఆ తరువాత ఈ వ్యాధి 9 జిల్లాలకు పాకింది. ఆ 9 జిల్లాల పరిధితో దాదాపుగా 91 గ్రామాలు ఉండగా, ఒక్క అయ్‌జోల్ జిల్లాలోనే 55 గ్రామాలు ఉండటం ఆంధోళన కలిగిస్తోంది. ఈ ఆఫ్రికన్ […]
మేషం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. అపుడపుడూ పెద్దల ఆరోగ్యంలో సమస్యలు తలెత్తగలవు. అధికారులతో మనస్పర్థలు తలెత్తుతాయి. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకుంటారు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. వృషభం : అద్దె ఇంటి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను అతికష్టంమ్మీద పూర్తిచేస్తారు. షాపుల మార్పుతో వ్యాపారాలు ఊపందుకుంటాయ. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రదేశ సందర్శనలు, […]
మూడు ముళ్లు ఏడు అడుగులు వేస్తే పెళ్లి అయిపోతుంది. సామాన్యంగా జరుపుకునే పెళ్లిళ్లలో ఎలాంటి హడావుడి కనిపించదు. కానీ, కొన్నిచోట్ల పెళ్లిళ్లలో హడావుడి చేస్తుంటారు. గతంలో పెళ్లికొడుకు రివాల్వర్ తో గాల్లోకి కాల్పులు జరిపి కటకటాల పాలైన సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఇలాంటి ఘటన మరోకటి యూపీలో జరిగింది. ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతాప్‌ఘర్ జిల్లాలోని జెథ్వారా ప్రాంతానికి చెందిన రూపా పాండే అనే యువతి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుక జరిగే సమయంలో […]
ఆయోద్యలో రామాలయ నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. గతేడాది నుంచి కరోనా మహమ్మారి కారణంగా మొదట్లో పనులు కొంత ఆలస్యమైనా, ఆ తరువాత పనులు వేగవంతం చేశారు. అక్టోబర్ నాటికి అయోద్య రామాలయం పునాదుల పనులు పూర్తవుతాయని, వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి రామాలయం మొదటి ఫ్లోర్ పనులు పూర్తి అవుతాయని అయోద్య రామాలయం ట్రస్ట్ సంస్థ ప్రకటించింది. 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల లోపే అయోద్య రామాలయ నిర్మాణం పూర్తవుతుందని ట్రస్ట్ ప్రటించింది. […]