భారత దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న. ఇప్పటి వరకు మొత్తం 48 మందికి భారత రత్న అవార్డులు పొందగా, ఇందులో 14 మందికి మరణానంతరం ఈ అవార్డులు పోందారు. భారత రత్న అవార్డులు పొందిన వారిలో అమర్త్య సేన్ కూడా ఒకరు. ఈ పురస్కారం పోందిన వారికి ఎయిర్ ఇండియా సంస్థ ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఉచిత ప్రయాణం వినియోగించుకున్న వారిలో అమార్త్యసేన్ ముందు వరసలో ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు 21 సార్లు ఉచిత విమాన ప్రయాణం పోందినట్టు ఆర్టీఏ అధికారులు తెలిపారు. అయితే అమార్త్యసేన్ ఉచిత ప్రయాణం కోసం ఎయిర్ ఇండియా ఎంత ఖర్చు చేసింది అనే విషయాన్ని మాత్రం ఎయిర్ ఇండియా వెల్లడించలేదు.