తాలిబన్లు 75 శాతానికి పైగా ఆఫ్ఘన్ ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాబూల్ మినహా మిగతా భూభాగాలను ఇప్పటికే తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. తాలిబన్, ఆఫ్ఘన్ ప్రభుత్వాల మధ్య సంధికి ఖతార్ ప్రయత్నాలు చేస్తున్నది. అధికారాన్ని తాలిబన్లతో కలిసి పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ఇక, తాలిబన్ల ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని ఇండియాతో సహా 12 దేశాలు స్పష్టం చేశాయి. ఇక ఇదిలా ఉంటే, తాలిబన్ నేతలు ఇండియాపై ప్రశంసలు […]
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే మూడోంతుల ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు తాజాగా మరో నాలుగు రాష్ట్రాల రాజధాని ప్రాంతాలను సొంతం చేసుకున్నారు. దీంతో దక్షిణ ఆఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లింది. ప్రస్తుతం రాజధాని కాబుల్ కు 80 కిలోమీటర్ల దూరంలో సైనికులకు, తాలిబన్లకు మధ్య భీకరపోరు జరుగుతున్నది. ఎప్పుడైతే అమెరికా, నాటో దళాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తప్పుకోవడం మొదలుపెట్టాయో అప్పటి నుంచి తాలిబన్ల ఆగడాలు పెరిగిపోయాయి. ఒక్కొక్క ప్రాంతాన్ని తమ ఆదీనంలోకి తెచ్చుకున్నారు. […]
దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నా ఉధృతి ఏ మాత్రం తగ్గడంలేదు. డెల్టా, డెల్టాప్లస్ వేరియంట్లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా డెల్టా వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. మొదటి వేవ్‌లో 60 ఏళ్లు పైబడిన వారికి ఎక్కువగా కరోనా సోకగా, సెకండ్ వేవ్‌లో మధ్యవయస్కులు ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. కాగా, గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ నగరాల్లో చిన్నారులకు కరోనా సోకుతుండటంతో థర్డ్ వేవ్ మొదలైందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే మిజోరాం రాష్ట్రం రాజధాని ఐజ్వాల్‌లో చిన్నారులు […]
పాము కనిపిస్తే దూరంగా పరుగులు తీస్తాం. పాము కాటేస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటాం. కానీ, ఓ వ్యక్తి మాత్రం తనను కాటేసిన పామును వెతికి పట్టుకొని దానికి నోటితో కొరికి చంపేశాడు. ఆ తరువాత తీరిగ్గా నాటు వైద్యుడి వద్దకు వెళ్లి మందు తీసుకున్నాడు. ఈ సంఘటన ఒడిశా లోని జాజ్‌పూర్ జిల్లాలో జరిగింది. జాజ్‌పూర్ జిల్లా గంభారిపటియా గ్రామానికి చెందిన కిషోర్ భద్రా అనే వ్యక్తి పోలంలో పనిచేస్తుండగా రక్తపింజరి పాము కరిచింది. […]
ప్రపంచంలో ఇప్పటి వరకు కొన్ని వేల సినిమాలు వచ్చి ఉంటాయి. అందులో తప్పకుండా చూసి తీరాల్సిన సినిమాలు కొన్ని ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ది బ్రిడ్డ్ ఆన్ ది రివర్ కవాయ్. 2.8 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ చిత్రం 1957 అక్టోబర్ 11 న యూకేలో రిలీజ్ కాగా, డిసెంబర్ 14, 1957లో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. దాదాపుగా 30.6 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసింది. వార్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో […]
చనిపోయిన ప్రతి మనిషి తమ అవయవాలను దానం చేస్తే ఈ భూమిపై కొన్ని కోట్ల మందికి ప్రాణదానం చేసినట్టవుతుంది. చనిపోయిన తరువాత బూడిదగా మారేకంటే అవయవాలను దానం చేయడం వలన పది మందికి ఉపయోగపడుతుంది. మనిషి తన శరీరంలోని 200 అవయవాలను దానం చేయవచ్చు. గుండె, మూత్రపిండం, కాలేయం, పాంక్రియాస్, కాళ్లు, చేతులు, కళ్లు, ఎముక మజ్జా ఇలా 200 వరకు అవయవాలను దానం చేయవచ్చు. మనిషి చనిపోతూ మరో మనిషికి బతికించవచ్చే ఆలోచనతో వరల్డ్ ఆర్గాన్ […]
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. సెకండ్ వేవ్‌కు కారణమైన డెల్టావేరియంట్ మ్యూటేషన్‌లు చెంది డెల్టాప్లస్ వేరియంట్ గా మార్పులు చెందింది. ఈ డెల్టాప్లస్ వైరస్‌లో కూడా ఏవై3, ఏవై3.1 కేసులు పెరుగుతున్నాయి. వేరియంట్ కేసుల వ్యాప్తిని అడ్డుకోవాలంటే వేగంగా వ్యాక్సిన్ పంపిణీ చేయాలని నిపుణులు చెబుతున్నారు. డెల్టాప్లస్ వైరస్‌లో ఏవై3 రకం కేసులు ప్రపంచవ్యాప్తంగా 17 వేలకు పైగా నమోదయ్యాయని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో ఏవై3 రకం కేసులు 263 ఉన్నాయి. వైరస్ మ్యూటేషన్ జరగకుండా […]
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ఆరాచకాలు, ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే సంహభాగం ప్రాంతాలను తాలిబన్ ఉగ్రవాదులు స్వాధీనం చేసుకున్నారు. త్వరలోనే కాబూల్‌ను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటామని చెబుతున్న తాలిబన్లు తాజాగా కాందహార్ నగరాన్ని సొంతం చేసుకున్నారు. రాజధాని కాబుల్ తరువాత రెండో పెద్ద నగరంతో పాటుగా, ఆర్ధికంగా, వాణిజ్యపరంగా అభివృద్ది చెందిన నగరం కావడంతో దీనిపైనే దృష్టి పెట్టారు తాలిబన్ ఉగ్రవాదులు. అంతేకాదు, తాలిబన్ ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది కూడా కాందహార్ నగరంలోనే కావడంతో ఇది వారికి కీలకంగా […]
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఈనెల 24 నుంచి తెలంగాణలో పాదయాత్ర చేయబోతున్నారు. ఈ పాదయాత్ర పేరును ఈరోజు ఖరారు చేశారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తరువాత పేరును ప్రకటించారు ఎమ్మెల్యే రాజాసింగ్. ప్రాజా సంగ్రామ యాత్ర పేరుతో ఈనెల 24 నుంచి బండి సంజయ్ పాదయాత్రను చేపట్టబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే పాదయాత్రకు సంబందించిన రూట్‌మ్యాప్‌ను ఖరారు చేసిన బీజేపీ, యాత్ర పేరు కూడా ప్రకటించడంతో […]