పాము కనిపిస్తే దూరంగా పరుగులు తీస్తాం. పాము కాటేస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటాం. కానీ, ఓ వ్యక్తి మాత్రం తనను కాటేసిన పామును వెతికి పట్టుకొని దానికి నోటితో కొరికి చంపేశాడు. ఆ తరువాత తీరిగ్గా నాటు వైద్యుడి వద్దకు వెళ్లి మందు తీసుకున్నాడు. ఈ సంఘటన ఒడిశా లోని జాజ్‌పూర్ జిల్లాలో జరిగింది. జాజ్‌పూర్ జిల్లా గంభారిపటియా గ్రామానికి చెందిన కిషోర్ భద్రా అనే వ్యక్తి పోలంలో పనిచేస్తుండగా రక్తపింజరి పాము కరిచింది. తనను పాము కరిచిందని గుర్తించిన కిషోర్ ఆ పామును వెతికి పట్టుకున్నాడు. తనను కరిచిన ఆ పామును కొపంతో కొరికి చంపేశాడు. అక్కడితో ఆగకుండా ఆ పామును ఇంటికి తీసుకొచ్చి భార్యకు చూపి జరిగిన విషయం చెప్పాడు. విషయం గ్రామంలో తెలియడంతో చుట్టుపక్కలవారు వచ్చి ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. తాను నాటు వైద్యం తీసుకున్నానని, బాగానే ఉన్నానని చెప్పాడు కిషోర్ భద్ర. ఈ న్యూస్ ఇప్పుడు ఒడిశాలో వైరల్‌గా మారింది.
Read: ది బ్రిడ్జ్ ఆన్ ది రివర్ కవాయ్…చూసి తీరాల్సిందేనోయ్… ఎందుకంటే…!!