కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రపంచం మొత్తం ఘోషిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఆర్ధిక స్తోమతను బట్టి వివిధ దేశాలు వ్యాక్సినేషన్‌ను అమలు చేస్తున్నాయి. అయితే, వ్యాక్సిన్‌ను విమర్శించేవారు, వ్యాక్సిన్‌పై నమ్మకం లేనివారు కూడా కోకొల్లుగా ఉన్నారు. అలాంటి వారిలో ఓ జర్మన్ నర్సు కూడా ఉన్నది. బ్రెజిల్ లోని ఉత్తర సముద్రతీరంలోని ప్రైస్‌ల్యాండ్ ప్రాంతంలోని ఓ టీకా కేంద్రంలో నర్సుగా పనిచేస్తున్న మహిళ… 8600 మందికి వ్యాక్సిన్ కు బదులుగా సెలైన్ ద్రావణాన్ని […]
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. తాజాగా ఇండియాలో 40,120 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. దీంతో దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,21,17,826కి చేరింది. ఇందులో 3,13,02,345 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 3,85,227 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక, గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 585 మంది మృతి చెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు 4,30,254 మంది కరోనాతో మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ […]
డ్రాగన్ దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కరోనాకు పుట్టినిల్లైన చైనాలో కేసులు పెరుగుతుండటంతో ఆ దేశంలో ఆందోళనలు మొదలయ్యాయి. 2019లో వూహన్ నగరంలో తొలి కరోనా కేసు నమోదైంది. కరోనా మహమ్మారి సమయంలో వూహన్‌లో అప్పట్లో కఠినమైన నిబంధనలు అమలుచేశారు. కరోనా సోకిన వారికి ఇళ్లలో ఉంచి బయట తాళాలు వేశారు. ఐరన్ బార్స్‌తో తలుపులు తెరుచుకోకుండా చేశారు. కరోనా నుంచి కొలుకునే వరకు ఇంటి నుంచి ఎవర్నీ బయటకు రానివ్వలేదు. ఇప్పుడు డెల్టావేరియంట్ ఆ […]
మాములుగా కేకు ధరలు అందులో వినియోగించే పదార్ధాలను బట్టి ఉంటుంది. ఎంత ఖరీదుపెట్టి కొనుగోలు చేసినా రెండు మూడు రోజులకు మించి ఉండదు. కానీ, ఆ కేకు 40 ఏళ్ల క్రితం నాటిది. పైగా రాజకుటుంబం పెళ్లి సమయంలో కట్ చేసిన కేకు కావడంతో వేలంలో భారీ ధరకు అమ్ముడు పోయింది. 1981 జులై 29 వ తేదీన బ్రిటన్ యువరాజు చార్లెస్-డయానాలు పెళ్లిజరిగిన రోజు. ఆ రోజున ఈ కేకును కట్ చేసి అందరికి పంచారు. […]
తాలిబన్లకు, ఆఫ్ఘన్ సైన్యానికి మధ్య గత కొన్ని రోజులుగా భీకర పోరు జరుగుతున్నది. నాటో దళాలు, అమెరికా సైన్యం ఆఫ్ఘన్ నుంచి తప్పుకోవడంతో తాలిబన్‌లు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని కీలకమైన ప్రాంతాలను సొంతం చేసుకున్నారు. కాందహార్‌తో పాటు, మూడో అతిపెద్ద కీలక నగరమైన హెరాత్‌ను కూడా తాలిబన్లు తమ ఆదీనంలోకి తీసుకున్నారు. మరికొన్ని రోజుల్లో రాజధాని కాబుల్‌ను తాలిబన్లు స్వాదీనం చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. దీంతో ఆఫ్ఘన్ ప్రభుత్వం కీలక ప్రతిపాదనను తాలిబన్ నేతల ముందుకు […]
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కాబోతున్నాయా అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత పరిణామాలు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ కేంద్రం నుంచి గద్దె దించాలనే లక్ష్యంతో కలిసి పనిచేయడానికి సిద్ధం అవుతున్నాయి. ఈనెల 20 వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ నేతృత్వంలో ప్రతిపక్షాలు సమావేశం కాబోతున్నాయి. ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణపై దృష్టిసారించనున్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించే అవకాశం ఉంది. ధరల పెరుగుదల, […]
భూమి చుట్టూ ఉన్న విశ్వంలో ఎన్నో గ్రహశకలాలు తిరుగుతున్నాయి. ఎప్పుడు వాటి నుంచి ముప్పు ఉంటుందో చెప్పడం కష్టం. గ్రహశకలాల నుంచి వచ్చే ముప్పును ఎప్పటికప్పుడు నాసా సంస్థ పరిశీలిస్తుంటుంది. ఎదైనా ప్రమాదాలు ఉంటే ముందుగానే హెచ్చరిస్తుంటుంది. 2016లో బెన్ను అనే గ్రహశకలాన్ని నాసా గుర్తించింది. దీని వలన భూమికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నట్టుగా గుర్తించింది. అదే ఏడాది నాసా ఒసైరిస్ రెక్స్ అనే వ్యోమనౌకను ఆ గ్రహశకలం మీదకు పంపింది. నాలుగేళ్లపాటు ప్రయాణం చేసిన […]
మేషం : వ్యాపారాలలో ఆటుపోట్లను ధైర్యంగా ఎదుర్కొని లాభాల బాటలో నడిపిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు సామాన్యమైన లాభాలనే ఇస్తాయి. ఉద్యోగస్తులు పదోన్నతి కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. లీజు, ఏజెన్సీలు, కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. వృషభం : కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. పెద్దల గురించి అప్రియమైన వార్తలు వినవలసివస్తుంది. ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. భూ వివాదాలు కొత్త మలుపు […]
చైనా ప్రభుత్వం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరికీ తెలియదు. ఒకసారి నిర్ణయం తీసుకున్నాక దానిని అమలు చేసి తీరాల్సిందే. వ్యతిరేకిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వానికి భయపడి ఎవరూ ఎదురుచెప్పరు. తాజాగా డ్రాగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనాలో కారియోకీ పాటలు విరివిగా వినిపిస్తుంటాయి. వీటికి అభిమానులు అత్యధికంగా ఉంటారు. వీటిని బార్లలో వీటిని ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. కారియోకీ పాటల అవుట్‌లెట్లు సుమారు ఆ దేశంలో 50 వేలకు పైగా ఉన్నాయి. […]