దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈరోజు నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం అయ్యాయి. అనేక విశ్వ విద్యాలయాల పరీక్షలు కూడా ప్రారంభం అయ్యాయి. చాలా కాలం తరువాత తిరిగి ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకోవడంతో సందడి వాతావరణం నెలకొన్నది. థర్డ్ వేవ్ ముప్పు ఉందనే వార్తలు వస్తున్నప్పటికీ, తల్లిదండ్రులు పిల్లలు బడికి పంపుతుండటంతో ప్రభుత్వాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఇక, టీచర్లకు ఇప్పటికే వ్యాక్సిన్‌ను అందించారు. మిగిలిన కొంతమందికి కూడా వేగంగా వ్యాక్సిన్ అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇక […]
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో తిరిగి ఆ దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో అని ప్రపంచం మొత్తం అందోళన చెందుతున్నది. ఆఫ్ఘనిస్తాన్ చిన్నదేశమే అయినప్పటికి భారత్‌కు మిత్రదేశం. ఆ దేశంలో భారత్ కోట్లాది రూపాయలను పెట్టుబడిగా పెట్టి జాతీయ ప్రాజెక్టులు, రహదారులు నిర్మించింది. ఇప్పుడు తాలిబన్ల చేతిలోకి ఆఫ్ఘన్ పాలన వెళ్లడంతో దాని ప్రభావం అనేక వస్తువులపై పడే అవకాశం ఉన్నది. ఇండియా నుంచి అనేక వస్తువులను దిగుమతి చేసుకునే ఆఫ్ఘనిస్తాన్, ఇకపై ఇండియా నుంచి ఆ వస్తువులను […]
శనివారం రోజున కరేబియన్ దీవుల్లోని హైతీలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంప విధ్వంసానికి వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ భూకంపం ధాటికి ఇప్పటి వరకు 1300 మందికి పైగా మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు. వందలాది భవనాలు నేలమట్టం కావడంతో, శిధిలాల కింద చిక్కుకున్న వారికి రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైతీలో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతగా నమోదైన సంగతి తెలిసిందే. రాజధాని పోర్ట్ ఓ […]
ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత సంఘటన జరిగింది. మామూలుగానే కోతులు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటికి ఏదైనా దొరికితే తీసుకొని చెట్టెక్కి కూర్చుంటాయి. అలానే ఉత్తర ప్రదేశ్‌లోని హార్దోయి జిల్లాలోని సాంఢీ పోలిస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న బైక్ నుంచి మూడు లక్షల బ్యాగ్‌ను ఎత్తుకొని వెళ్లి చెట్టుమీద కూర్చుంది. విషయం గమనించిన బైక్ యజమాని ఆశిష్ సింగ్ తన బ్యాగ్ ఇచ్చేయమని కోతిని బతిమిలాడాడు. కానీ, కోతి పట్టించుకోలేదు. వెంటనే […]
దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆగస్టు 15 వ తేదీ ఆదివారం రోజున స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంగరంగంగా నిర్వహించుకుంటుంటే, మేఘాలయ రాష్ట్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా అలజడులు జరిగాయి. మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో ఆందోళనలు జరిగాయి. నేషనల్ లిబరేషనల్ కౌన్సిల్ మాజీ నేత థాంగ్‌కీ ఎన్‌కౌంటర్‌తో ఒక్కసారిగి షిల్లాంగ్ అట్టుడికిపోయింది. ఆందోళన కారులు రోడ్లపైకి వచ్చి వాహనాలను ధ్వంసం చేశారు. ఇటీవలే లైతుంఖ్రా వద్ద జరిగిన బాంబు దాడుల్లో థాంగ్‌కీ హస్తం ఉందనే అనుమానాలు కలగడంతో ఆయన్న […]
2001లో అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ టవర్స్‌పై అల్‌ఖైదా ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడిలో వరల్డ్ ట్రేడ్ టవర్స్ పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు జూనియర్ బుష్ ఆఫ్ఘనిస్తాన్‌లోని అల్‌ఖైదా నాయకుడు లాడెన్ ఉన్నాడని, అతడిని తమకు అప్పటించాలని అమెరికా కోరింది. కానీ, అందుకు అప్పటి తాలిబన్ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో ఆఫ్ఘన్‌లోని తాలిబన్ సేనలపై అమెరికా సైనికులు దాడులు చేశారు. తాలిబన్‌లను తరిమికొట్టి ఆ దేశంలో ప్రజాస్యామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పారు. అప్పటి […]
తాలిబన్ల పేరు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా మారుమ్రోగిపోతున్నది. లక్షలాది మంది సైనికులు, ఆధునిక ఆయుధసంపత్తి, 20 ఏళ్లుగా అమెరికా సైన్యం ఇచ్చిన ట్రైనింగ్‌లో రాటు తేలిన ఆఫ్ఘన్ సైనికులను రెండు వారాల వ్యవధిలోనే ఓడించి దేశాన్ని వారి చేతుల్లోకి తీసుకున్నారు. తాము లేకున్నా, ఆఫ్ఘన్ సైనికులు పోరాటం చేయగలరనే ధీమాతో ఆమెరికా అక్కడి నుంచి వైదొలిగింది. సెప్టెంబర్ 11 వరకు ఆఫ్ఘన్ నుంచి పూర్తిగా వెనక్కి వచ్చేయాలని ఆమెరికా నిర్ణయం తీసుకోవడంతో తాలిబన్లు రెచ్చిపోయారు. చాలా ప్రాంతాల్లో […]
మేషం : ఉద్యోగులకు స్థానచలన యత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు అధిక ఉత్సాహం ప్రదర్శించడం వల్ల సమస్యలకు లోనవుతారు. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. స్త్రీలకు నరాలు, దంతాలు, ఎముకులకు సంబంధించిన చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. వృషభం : ఉద్యోగస్తులు పై అధికారులతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వస్త్ర, బంగారం, వెండి, వ్యాపారుల్లో పోటీతత్వం పెరుగుతుంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. విదేశాల్లోని ఆత్మీయులకు ప్రియమైన వస్తు సామాగ్రి అందజేస్తారు. హోటల్, […]
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా కోలుకోలేదు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడుతుండటంతో మరింత రక్షణ కోసం మూడో డోస్ వ్యాక్సిన్‌ను ఇవ్వాలని అమెరికా సీడీసి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సగం జనాభాకు రెండు డోసుల వ్యాక్సిన్‌లను అందించారు. మూడో డోస్ ఇవ్వడం వలన అదనపు రక్షణ కలుగుటుందని రెండు డోసులు తీసుకున్నవారికి మూడో డోసు ఇవ్వాలని సీడీసి పేర్కొన్నది. అవయవ మార్పిడి చేయించుకున్నవారు, ఇతర కారణాల చేత బలహీనంగా ఉన్న వ్యక్తులు […]