శనివారం రోజున కరేబియన్ దీవుల్లోని హైతీలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఈ భూకంప విధ్వంసానికి వందలాది ఇళ్లు నేలమట్టం అయ్యాయి. ఈ భూకంపం ధాటికి ఇప్పటి వరకు 1300 మందికి పైగా మృతి చెందినట్టు అధికారులు చెబుతున్నారు. వందలాది భవనాలు నేలమట్టం కావడంతో, శిధిలాల కింద చిక్కుకున్న వారికి రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైతీలో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 7.2 తీవ్రతగా నమోదైన సంగతి తెలిసిందే. రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్‌కు 125 కిలోమీటర్ల దూరంలో భూకంపకేంద్రం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక ఈనెల 7 వ తేదీన హైతీ అధ్యక్షుడు జొవెనెల్ మోయిస్ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆ విషాదం నుంచి హైతీ కోలుకోక ముందే భూకంపం విధ్వంసం సృష్టించింది.