కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇంకా కోలుకోలేదు. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కరోనా బారిన పడుతుండటంతో మరింత రక్షణ కోసం మూడో డోస్ వ్యాక్సిన్‌ను ఇవ్వాలని అమెరికా సీడీసి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సగం జనాభాకు రెండు డోసుల వ్యాక్సిన్‌లను అందించారు. మూడో డోస్ ఇవ్వడం వలన అదనపు రక్షణ కలుగుటుందని రెండు డోసులు తీసుకున్నవారికి మూడో డోసు ఇవ్వాలని సీడీసి పేర్కొన్నది. అవయవ మార్పిడి చేయించుకున్నవారు, ఇతర కారణాల చేత బలహీనంగా ఉన్న వ్యక్తులు వీలైనంత త్వరగా మూడో డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలని అమెరికా అంటువ్యాధుల నిర్మూలన కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఫైజర్, మోడెర్నా రెండు డోసుల టీకాలు కాగా, జాన్సన్ అండ్ జాన్సన్ సింగిల్ డోస్ టీకా. అమెరికాలో రోజువారీ కేసులు లక్షకు పైగా నమోదవడంతో పాటుగా, మరణాల సంఖ్య కూడా పెరుగుతుండటంతో సీడీసి ఈ నిర్ణయం తీసుకుంది.
Read: మరణం గురించి ఎలన్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు… ఎక్కడ చనిపోవాలనుకుంటున్నాడంటే…