ఆఫ్ఘనిస్తాన్‌లో ఆరాచక పాలన అమలౌతుందని అక్కడి ప్రజలు భయపడిపోతున్నారు. అయితే, తాలిబన్లు అలాంటి పాలన ఉండబోదని, ప్రజలు మెచ్చే విధంగా పాలన చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి గంటలు గడవక ముందే అక్కడ ఆరాచకం మొదలైంది. ఆఫ్ఘనిస్తాన్ జాతీయ జెండా ఎగరవేసిన చోట తాలిబన్లు కాల్పులు జరిపారు. ప్లకార్డులు పట్టుకున్న మహిళలను దారుణంగా హింసిస్తున్నారు. ఒంటరిగా బయటకు రావాలంటే మహిళలు భయపడుతున్నారు. అనుకున్నట్టుగానే అక్కడ తాలిబన్లు ప్రజాస్వామ్య ప్రభుత్వానికి తావులేదని ప్రకటించారు. షరియా చట్టం ప్రకారమే పాలన సాగుతుందని తెలిపారు. దీంతో ఆఫ్ఘన్ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటికే ఎంబసీలు ఖాళీ అయ్యాయి. మరికొన్ని రోజుల్లో ప్రపంచ దేశాలు తమ ఎంబసీలను పూర్తిగా ఖాళీ చేసి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మధ్యయుగం నాటి శిక్షలు మళ్లీ అమలౌతాయని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.