2001లో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారంలో ఉండగా బమియన్ లోని బుద్ధుని భారీ విగ్రహాన్ని పేల్చివేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు అదే బమియన్‌లోని హజారా జాతి నాయకుడు అబ్దుల్ అలీ మజారీ విగ్రహాన్ని బాంబులతో పేల్చివేశారు. హజారా జాతికి చెందిన వ్యక్తులు అప్పట్లో తాలిబన్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. హజరాజత్ అనే పర్వత ప్రాంతాల్లో నివశించే ప్రజలను హజారాలు అని పిలుస్తారు. మంగోల్ సామ్రాజ్యస్థాపకుడు ఛెంగిజ్ ఖాన్ వారసులు. 13 వ శతాబ్ధం నుంచి ఈ హజారాలు హజరాజత్ పర్వత ప్రాంతాల్లో నివశిస్తుంటారు. ఈ హజారాలు షియా ముస్లింలు. ఆఫ్ఘన్‌లో షియా ముస్లింలను మైనారిటీలుగా చూస్తారు. అయితే, మిలిటెంట్ గ్రూపులకు చెందిన సున్నీ ముస్లింలకు, షియాలకు నిత్యం గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 1995 వ సంవత్సరంలో హజారా నాయకుడిగా ఉన్న అబ్ధుల్ అలీ మజారీని తాలిబన్‌లు కిడ్నాప్ చేసి ఉరి తీసి ఆయన మృతదేశాన్ని హెలికాఫ్టర్‌కు వేలాడదీశారు. తాలిబన్ల నిష్క్రమణ తరువాత బమియన్ ప్రాంతంలో మజారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కాగా, ఆఫ్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న వెంటనే తాలిబన్లు హజారా నాయుడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం విశేషం. తాలిబన్లలో ఏ మార్పు రాలేదని, అదే కౄరత్వాన్ని ప్రదర్శిస్తున్నారని చెప్పడానికి ఇదోక నిదర్శనమని చెప్పొచ్చు.
Read: ప్రపంచం ముందు మరో భయం: తాలిబన్ల విజయం వెనుక అరుణదళం…