నిన్నటి రోజున తిరుపతిలో జన ఆశీర్వాదసభకు హాజరైన కిషన్ రెడ్డి ఆ సభ తరువాత ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం కిషన్ రెడ్డి విజయవాడ కనకదుర్గ ఆలయాన్ని సందర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి, ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శనం చేసుకొని కారు ఎక్కుతుండగా కారు డోర్ తగలడంతో ఆయన తలకు స్వల్పగాయం అయింది. స్వల్పమైన గాయమేనని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని అధికారులు పేర్కొన్నారు. […]
దేశంలో క్రికెట్ ఆటకు ఎంతటి క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి గల్లీలో ఖాలీ దొరికితే పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు. ఇక క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకొని ప్రొఫెషనల్‌గా మారాలి అనుకున్న వారు అదే లోకంగా గడుపుతారు. అయితే, కొంతమందికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరికి ఎంత ప్రయత్నించినా కలిసిరాదు. అసోంకు చెందిన ప్రకాష్ భగత్ అనే ఆల్ రౌండర్ 2003లో గంగూలీతో కలిసి నేషనల్ క్రికెట్ అకాడమీలో గంగూలీలో కలిసి క్రికెట్ ఆడాడు. ప్రకాష్ భగత్ […]
డెల్టా వేరియంట్‌పై వ్యాక్సిన్ల ప్రభావం ఏ మేరకు ఉన్నది అనే విషయంపై ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం కీలక పరిశోధన చేస్తున్నది. ఈ కీలక పరిశోధనల ప్రకారం, కరోనా మొదటితరం ఆల్ఫా వేరియంట్‌పై ఈ వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని, కానీ, డెల్టా వేరియంట్‌పై ప్రభావం కొంతమేర తక్కువగానే ఉందని ఆక్స్‌ఫర్డ్ పరిశోధనలలో తేలింది. డిసెంబర్ 1, 2020 నుంచి మే 16, 2021 వరకు శాంపిల్స్‌ను సేకరించి పరిశోధనలు చేశారు. అదే విధంగా మే 17, 2021 నుంచి ఆగస్టు […]
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడి పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. తాలిబన్లకు పాకిస్తాన్ సహాయం చెసిందని అనేక దేశాలు ఆరోపిస్తున్నాయి. పాక్‌లో ఉగ్రవాద సంస్థలు అనేకం ఆశ్రయం పోందుతున్నాయి. తాలిబన్లు ఆక్రమించుకునే ముందు రోజు ఆ దేశ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయారు. అయితే, ప్రస్తుతం ఉపాద్యక్షుడు తాలిబన్లపై పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆఫ్ఘన్‌ను తనలో కలుపుకునేంత దమ్ము పాక్‌కు లేదని, పాలించేంతటి సీన్ తాలిబన్లకు లేదని మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ పేర్కొన్నారు. […]
ఇరాన్‌లో రోజువారీ కరోనా కేసులు పెద్దసంఖ్యలో నమోదవుతున్నాయి. ప్రతిరోజు 50 వేలకు పైగా నమోదవుతుండటం అందోళన కలిగిస్తోంది. ఇక ఇరాన్‌లో అమెరికా, బ్రిటన్‌లకు చెందిన టీకాలను నమ్మడంలేదు. ఆ రెండు దేశాలు తయారు చేసిన టీకాలు నమ్మదగినవి కాదని ప్రభుత్వ వర్గాలు చెబుతుండటంతో ఇరాన్ లో వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్నది. వ్యాక్సిన్ లను బ్లాక్‌లో భారీ ధరలకు విక్రయిస్తున్నారు. అస్త్రాజెనకా వ్యాక్సిన్ ధర బ్లాక్‌లో 90 వేలకు పైగా పలుకుతున్నది. బ్లాక్‌లో ధరలు భారీగా […]
తక్కువ ధరకు వస్తుంది కదా అని చెప్పి ఓ వ్యక్తి సెకండ్ హ్యాండ్‌లో ప్రిడ్జ్‌ను కోనుగోలు చేశాడు. ఇంటికి తెచ్చుకున్నాక ఆ ప్రిడ్డ్ ను శుభ్రం చేసే సమయంలో కింద స్టిక్కర్ కనిపించింది. ఆ స్టిక్కర్‌ను ఓపెన్ చేయగా లోపలి నుంచి నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఒకటి కాదు రెండు కాదు… 1.30 లక్షల డాలర్లు. మన కరెన్సీలో సుమారుగా రూ.96 లక్షలు అని చెప్పొచ్చు. అంత పెద్ద మొత్తంలో డబ్బును చూసి మొదట కోనుగోలు దారుడు […]
భారత్‌లో మరో మూడు వ్యాక్సిన్లు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నాయి. అందులో ఒకటి స్పుత్నిక్ వీ లైట్. రష్యాకు చెందిన గమలేరియా సంస్థ ఈ టీకాను తయారు చేసింది. ఇప్పటికే అనేక దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. ఇండియాకు చెందిన పనాసియా బయోటెక్ సంస్థ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం తరువాత పనాసియా సంస్థ భారత్‌లో అత్యవసర అనుమతుల కోసం ధరఖాస్తు చేసుకుంది. ఈ వ్యాక్సిన్ డేటాను భారత్ డ్రగ్ […]
ఇటీవల టోక్యో ఒలింపిక్స్‌లో ఆ మహిళ జావెలింగ్ త్రో విభాగంలో రజత పతకం సాధించింది. పతకం తీసుకొని ఆనందంతో తిరిగి పోలెండ్ వెళ్లిన ఆ మహిళా అథ్లెట్ ముందు ఓ సమస్య కనిపించింది. ఓ చిన్నారి ఆరుదైన గుండె జబ్బుతో బాధపడుతున్నట్టుగా తెలిసింది. ఆ చిన్నారి వైద్యంకు అయ్యేంత డబ్బు తనవద్దలేదు. వెంటనే తాను గెలుచుకున్న ఒలింపిక్ మెడల్‌ను వేలానికి ఉంచాలని నిర్ణయం తీసుకున్నది. ఆ విషయాన్ని ఫేస్‌బుక్ ద్వారా ప్రపంచానికి తెలియజేసింది. ఆ అథ్లెట్ తీసుకున్న […]
ఉల్లి పంట ఎక్కువగా పండే జిల్లాల్లో కర్నూలు ఒకటి. కర్నూలు జిల్లాలో రైతులు ఎక్కువగా ఉల్లిని పండిస్తుంటారు. ఉల్లి పంటకు ఎప్పుడు గిరాకి వస్తుందే ఎప్పడు నేల చూపులు చూస్తుందో తెలియని పరిస్థితి. ఇదిలా ఉంటే, జిల్లాలోని ఉల్లి రైతులు రోడ్డెక్కారు. గత 10 రోజులుగా ఉల్లిని కొనుగోలు చేయడం వ్యాపారులు నిలిపివేయడంతో రైతులు ఆందోళనల చేస్తున్నారు. ఈనాం పద్దతిలో ఉల్లిని కోనుగోలు చేయాలని అధికారులు చెబుతుండగా, తాము ఈనాం పద్దతిలో ఉల్లిని కొనుగోలు చేయలేమని చెప్పి […]
తాలిబన్ లు ఆఫ్ఘనిస్తాన్‌ను అక్రమించుకున్నాక అక్కడి పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తున్నట్టు విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌తో బలమైన సంబందాలు ఉన్నాయని, అక్కడ పెట్టిన పెట్టుబడులే అందుకు నిదర్శనం అని తెలిపారు. ఆఫ్ఘన్ ప్రజలు ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉన్నారని తెలిపారు. అయితే, తాలిబన్లు ఎలా పరిపానల చేస్తారు, ప్రపంచ దేశాలతో చర్చలు జరిపే అవకాశం ఉన్నదా లేదా అన్నది కొన్ని రోజుల్లోనే తేలిపోతుందని జైశంకర్ పేర్కొన్నారు. ఇక ఇదిలా ఉంటే, భారత్‌తో వాణిజ్యంపై ఇప్పటికే తాలిబన్లు […]