ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకునే ముందు రోజే అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ దేశం విడిచి పారిపోయాడు. సంచుల నిండా ధనం, కార్లతో ఆయన దేశం విడిచి హెలికాఫ్టర్‌లో వేరే దేశానికి వెళ్లిపోయాడు. అయితే, ఆయన ఏ దేశంలో ఉన్నాడు అన్నది బయటకు రాలేదు. తాజాగా మాజీ అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనికి యూఏఈ ఆశ్రయం ఇచ్చినట్టు పేర్కొన్నది. మానవతా దృక్పదంతో ఘనీకి ఆశ్రయం ఇచ్చినట్టుగా ఆ దేశం తెలియజేసింది. అయితే, ఘని ఏ నగరంలో ఉన్నారో, ఏ ప్రాంతంలో ఉన్నాడో, ఎలాంటి భద్రత కల్పించారు అనే విషయాలను మాత్రం యూఏఈ వెల్లడించలేదు. ఘనీ సేఫ్‌గానే ఉన్నారని మాత్రం తెలియజేసింది. దేశంలో రక్తపాతం జరగకూడదు అనే ఉద్దేశంతోనే తాను దేశం విడిచి వచ్చినట్టు మాజీ అధ్యక్షుడు ఘని ట్విట్టర్‌లో పేర్కొన్న సంగతి తెలిసిందే.