ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ ఆదివారం రోజున దేశాన్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన వెళ్తూ 116 మిలియన్ డాలర్లను, ఖరీదైన కార్లను తనవెంట తీసుకెళ్లారని వార్తలు వచ్చాయి. పలు దేశాలు ఈ విధమైన ఆరోపణలు చేశాయి. తజికిస్తాన్, రష్యాలు ఈ విధమైన ఆరోపణలు చేశాయి. అయితే, దీనిపై ఆఫ్రాఫ్ ఘనీ స్పందిచారు. తాను తన స్వార్ధం కోసం దేశాన్ని విడిచి రాలేదని, దేశంలో రక్తపాతం జరగకూడదని దేశాన్ని విడిచిపెట్టాల్సి వచ్చినట్టు తెలిపారు. ప్రమాదం ముంచుకొస్తోందని భత్రతా సిబ్బంది హెచ్చరించడం వలనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, కట్టుబట్టులు, ఉత్త చేతులతోనే తాను దేశం విడిచి వచ్చానని, ప్రజలను ఇబ్బందుల్లో పెట్టడం తన ఉద్దేశం కాదని, అక్కడే ఉంటే ఒక అధ్యక్షుడు తాలిబన్ల చేతిలో చనిపోవాల్సి వస్తుందని అన్నారు. తాను శాశ్వతంగా దేశాన్ని విడిచి రాలేదని, త్వరలోనే తిరిగి దేశానికి వస్తానని, తాలిబన్ల అభివృద్దికి కృషి చేస్తానని అన్నారు. మానవతా దృక్పధంతోనే యూఏఈ తనకు ఆశ్రయం ఇచ్చిందని, తాను ఎలాంటి డబ్బు తీసుకొని రాలేదని అన్నారు. కావాలంటే యూఏఈ కస్టమ్స్ అధికారులను అడిగి తెలుసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.