శ్రీ దయానంద సాగర్ తన 60 వ ఏట దయానంద సాగర్ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరులుగా, మంచి ప్రొఫెషనల్ లీడర్‌లుగా తీర్చిదిద్దేందుకు ఈ విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. దయానంద సాగర్ విశ్వవిద్యాలయం 2014వ సంవత్సరంలో కర్ణాటకలో అక్కడి చట్టాలకు అనుగుణంగా ఏర్పాటు చేశారు. ప్రపంచంలో ఉన్నతమైన, నాణ్యతతో కూడిన విద్యను అందించేందుకు ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం జరిగింది. దయానంద సాగర్ యూనివర్సిటీ విజన్ విద్య, పరిశోధన & శిక్షణ, ఆవిష్కరణ & […]
ఒకటి లేక రెండో రోజులు నిద్రపోలేదు అంటేనే కళ్లు ఎర్రగా మారి అనేక ఇబ్బందులు పడతాం. ఏ పని చేయలేము. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే, ఓ వ్యక్తి గత 48 ఏళ్లుగా నిద్రకు దూరంగా ఉంటున్నాడట. అయనే కాదు, అయన తండ్రి, తాత కూడా ఇలానే నిద్రపోకుండా ఉండేవారట. మధ్యప్రదేశ్‌లోని రేవాకు చెందిన మోహన్‌లాల్ చిన్న తనం నుంచి చాలా తక్కువగా నిద్రపోయేవాడు. 1973 లో గ్రూప్ పరీక్షలు రాసి తహసీల్దార్ గా ఉద్యోగం వచ్చిన […]
కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం ఇప్పటి వరకు కోలుకోలేదు. వేగంగా కేసులు వ్యాప్తి చెందుతున్నాయి. ఆల్ఫా, బీటా, ప్రస్తుతం డెల్టా వేరియంట్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే, డెల్టా వేరియంట్‌లతో పాటుగా డెల్టా ప్లస్ కేసులు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్‌తో పాటుగా సి 1.2 వేరియంట్ కూడా వ్యాపిస్తున్నట్టు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్యసంస్థ తెలియజేసింది. ఈ వేరియంట్‌ను దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ఇకపోతే, ఇప్పుడు ఎంయు అనే మరో కొత్త వేరియంట్ ప్రపంచాన్ని […]
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సేనలు తప్పుకున్నాయి. పూర్తిగా సేనలు తప్పుకోవడంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితులు పూర్తిగా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. అమెరికాలోని వరల్డ్ ట్రేడ్ టవర్స్‌పై ఉగ్రవాదుల దాడి తరువాత ఆఫ్ఘనిస్తాన్‌పై యుద్ధం ప్రకటించింది అమెరికా. సేనలు ఆఫ్ఘనిస్తాన్‌లోకి ప్రవేశించి ఉగ్రవాదులను తరిమికొట్టాయి. 2001లో ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేశాయి. 20 ఏళ్లపాటు ఆమెరికా రక్షణలో ఆఫ్ఘనిస్తాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వం నడిచింది. అమెరికా సేనలు ఉపసంహరించుకునే సమయానికి తిరిగి 2001 ముందునాటి పరిస్థితులు ఏర్పడ్డాయి. 20 ఏళ్ల కాలంలో […]
దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. ప్రతి నెలా గ్యాస్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. గతనెలలో గ్యాస్ ధరలో ఎలాంటి మార్పులు లేకపోవడంతో, ఈనెల కూడా అదేవిధంగా ఉంటుందని అనుకున్నారు. కానీ,ఈ సెప్టెంబర్ మాసానికి సంబందించి ధరలు పెంచుతూ గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.25, వాణిజ్య గ్యాస్ సిలిండర్‌పై రూ.75 పెంచినట్టు గ్యాస్ కంపెనీలు పేర్కొన్నాయి. పెరిగిన ధరలు ఈరోజు నుంచి అమలులోకి రానున్నాయి. తాజా పెరుగుదలతో ఢిల్లీలో వంటగ్యాస్ ధర […]
కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రకరకాల వేరియంట్లు పుట్టుకురావడంతో వాటికి తగినట్టుగా వ్యాక్సిన్లు రెడీగా లేకపోవడంతో మహమ్మారి బారిన పడేవారి సంఖ్య పెరుగుతూనే ఉన్నది. ప్రస్తుతం ప్రపంచంలో సీ 1.2 వేరియంట్ ప్రభలంగా వ్యాపిస్తోంది. ఈ వేరియంట్ మిగతావాటికంటే బలంగా ఉండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే, కరోనా నుంచి బయటపడాలి అంటే ప్రస్తుతానికి వ్యాక్సిన్ తీసుకోవడం, నిబందనలు పాటించడం ఒక్కటే మార్గం కావడంలో జాగ్రతగా ఉండాలని హెచ్చిరిస్తున్నారు. ఇక ఇదిలా […]
ఆగస్టు 31 వ తేదీ కంటే ముందే అమెరికా దళాలు ఆఫ్ఘన్‌ను వదిలి వెళ్లిపోయాయి. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లో చివరి సైనికుడితో సహా అందర్ని అమెరికా వెనక్కి తీసుకెళ్లింది. ఆఫ్ఘన్ రక్షణ కోసం అమెరికా లక్షల కోట్ల రూపాయలను ఖర్చుచేసి అధునాతన ఆయుధాలు సమకూర్చిన సంగతి తెలిసిందే. వెళ్లే సమయంలో వీలైన్ని ఆయుధాలను వెనక్కి తీసుకెళ్లిన అమెరికా, చాలా ఆయుధాలను ఆఫ్ఘన్‌లోనే వదిలేసింది. అయితే, వాటిని చాలా వరకు నిర్వీర్యం చేసింది. తిరిగి వినియోగించాలంటే దానికి తగిన టెక్నాలజీ, […]
20 ఏళ్లుగా అమెరికా, నాటో దళాల సంరక్షణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పూర్తిగా తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది. కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా బలగాలు పూర్తిగా తప్పుకున్నాక తాలిబన్లు ఎయిర్‌పోర్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాలిబన్ల ప్రభుత్వం అధికారంలో ఉన్నది. తాత్కాలిక శాఖలను ఏర్పాటు చేసి మంత్రులను నియమిస్తోంది. పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత తాలిబన్లు ఎలా పరిపాలించబోతున్నారు అన్నది ఉత్కంఠంగా మారింది. తాలిబన్ల చెరలోకి ఆఫ్ఘన్ వెళ్లిన వెంటనే విదేశీ నిథులను అమెరికా ఫ్రీజ్ చేసింది. […]
ఏపీలో మరోసారి కరోనా కేసులు పెరిగాయి. తాజాగా రాష్ట్రంలో 52,319 శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా 1115 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 20,14,116కి చేరింది. ఇందులో 19,85,566 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,693 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 19 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 13,857 మంది మృతి చెందారు. గడిచిన […]
ఫొటో పర్ఫెక్ట్‌గా వస్తుందని ఖచ్చితంగా ఎవరూ చెప్పలేరు. ఇక జంతువులు, పక్షులకు సంబంధించిన ఫొటోలను తీసే ఫొటోగ్రాఫర్లు ఖచ్చితమైన ఫొటోలు వచ్చేవరకు వేచి చూడాల్సిందే. కొన్ని మాత్రమే అద్భుతం అనిపించే ఫొటోలను తీయగలుగుతారు. అలాంటి వాటిల్లో ఇదికూడా ఒకటి. గద్ద ఒక చిన్న కొమ్మను పట్టుకొని వెళ్తుండగా, ఆ కొమ్మ వెనుక భాగంలో మరో నల్లని పక్షి కూడా కొమ్మను పట్టుకొని ఎగురుతున్నది. చిన్న చిన్న పక్షులు కనిపిస్తే వాటిని అమాంతంగా చంపేసి తినేస్తుంటాయి గద్దలు. అయితే, […]