FIFA World Cup: ఫ్రాన్స్‌కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Spain vs France: ఫిఫా వరల్డ్ కప్ 2026లో ‘స్పెయిన్’ మరోసారి తన సత్తా చాటింది. సెమీఫైనల్లో టైటిల్ ఫెవరెట్ గా ఉన్న ఫ్రాన్స్‌ను 2-0 తేడాతో ఓడించి ఘనంగా ఫైనల్‌కు అర్హత సాధించింది. క్రమశిక్షణతో కూడిన ఆట, పటిష్టమైన డిఫెన్స్, వచ్చిన అవకాశాలను గోల్స్‌గా మలచడం ఇలా అన్ని కలిపి లూయిస్ డే లా ఫుయెంటే శిష్యులు విజయం అందుకున్నారు. మికెల్ ఒయార్జబాల్, పెడ్రో పోరో చేసిన గోల్స్ స్పెయిన్‌కు విజయాన్ని అందించాయి. దీంతో ఆదివారం జరిగే ఫైనల్లో ఇంగ్లండ్, అర్జెంటీనా మ్యాచ్ విజేతతో స్పెయిన్ తలపడనుంది.
పెనాల్టీతో ఆధిక్యం:
మ్యాచ్ 22వ నిమిషంలో కీలక మలుపు అందుకుంది. యువ స్టార్ లామిన్ యమాల్‌ను ఫ్రాన్స్ డిఫెండర్ లూకాస్ డిగ్నే పెనాల్టీ బాక్స్‌లో ఫౌల్ చేయడంతో స్పెయిన్‌కు పెనాల్టీ లభించింది. ఆ అవకాశాన్ని మికెల్ ఒయార్జబాల్ ఎలాంటి తప్పిదం చేయకుండా గోల్‌గా మలిచాడు. బంతిని కుడి వైపు కింద మూలకు పంపి స్పెయిన్‌కు 1-0 ఆధిక్యం అందించాడు. ఈ గోల్ తర్వాత స్పెయిన్ ఆటలో మరింత ఆత్మవిశ్వాసం కనిపించగా.. ఫ్రాన్స్ మాత్రం బంతిపై ఆధిపత్యం సాధించినప్పటికీ దాన్ని గోల్స్‌గా మార్చలేకపోయింది. కిలియన్ ఎంబాప్పే చాలావరకు గోల్స్ కోసం దాడులు చేసినా స్పెయిన్ డిఫెన్స్ అద్భుతంగా అడ్డుకుంది.
Also Read
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
- Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
- Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
- Flydubai: మహిళలతో కరచాలనానికి కో-పైలట్ ఎందుకు నిరాకరించాడు? కారణమిదేనా?
మ్యాచ్‌పై పూర్తి పట్టు:
రెండో భాగం 58వ నిమిషంలో స్పెయిన్ మరోసారి జట్టు సమన్వయంతో రెండో గోల్ సాధించింది. డానీ ఒల్మో ఇచ్చిన అద్భుతమైన పాస్‌ను అందుకున్న పెడ్రో పోరో సాఫీగా బంతిని గోల్‌లోకి పంపించాడు. ఈ గోల్‌తో స్పెయిన్ 2-0 ఆధిక్యంలోకి వెళ్లి మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది. ఆ తర్వాత బంతిని ఎక్కువసేపు తమ ఆధీనంలో ఉంచుతూ ఫ్రాన్స్‌కు అవకాశాలు ఇవ్వకుండా తెలివిగా ఆటను నడిపించింది.
స్పెయిన్ డిఫెన్స్:
ఫ్రాన్స్ కోచ్ డిడియర్ డెషాంప్స్ పలు మార్పులు చేసినప్పటికీ స్పెయిన్ రక్షణను ఛేదించలేకపోయారు. అయ్మెరిక్ లపోర్టే నేతృత్వంలోని డిఫెన్స్ ప్రతి దాడిని సమర్థంగా అడ్డుకుంది. గోల్‌కీపర్ ఉనాయ్ సైమన్ కూడా కీలక సమయాల్లో అద్భుతమైన సేవ్‌లు చేస్తూ జట్టుకు అండగా నిలిచాడు. చివరి నిమిషాల్లో ఫ్రాన్స్ దూకుడు పెంచినా స్పెయిన్ రక్షణ గోడను బద్దలు కొట్టలేకపోయింది.
Here it is. Spectacular!!! https://t.co/5H7nw1P8yr
— Oyinade.R (@AkintibuboSeun) July 14, 2026
తాజావార్తలు
-
CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం’’.. సీజేపీ హెచ్చరిక!
-
Bank Holidays: అన్ని శనివారాలూ బ్యాంకు సెలవులా? వైరల్ వార్తపై కేంద్రం క్లారిటీ!
-
Global Horticulture Hub : రాయలసీమకు బిగ్ ప్రాజెక్ట్.. రూ.లక్ష కోట్ల హార్టికల్చర్ హబ్
-
Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్‌కు బ్రేక్.. ఈసీఐ కీలక నిర్ణయం.!
-
Flydubai Attack: కో-పైలట్‌కు ‘తీవ్ర ఇస్లామిస్ట్ భావజాలం’.. నెతన్యాహు సంచలన ఆరోపణలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?