ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. తాజాగా మంత్రి పేర్నినాని పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. ఏపీలో ప్రభుత్వం సినిమా హాళ్లను మూయించిందని పవన్ అన్నారని, ఏపీలో సుమారు 1100 థియేటర్లలో 800 థియేటర్లలో సినిమాలు ఆడుతున్నాయని పేర్నినాని పేర్కొన్నారు. ఇక తెలంగాణలో 519 థియేటర్లకు గాను 413 థియేటర్లలో మాత్రమే సినిమాలు ప్రదర్శిస్తున్నారని తెలిపారు. సినీ పరిశ్రమను ఏపీ ప్రభుత్వం ఎలా ఇబ్బంది పెట్టిందో చెప్పాలని మంత్రి పేర్నినాని పేర్కొన్నారు. నిర్మాతలకు తెలంగాణలో కంటే ఏపీలోనే ఎక్కువ షేర్ వస్తోందని అన్నారు. సాయిధరమ్ తేజ్ ప్రమాదంపై మీడియాచేసిన తప్పేంటి, పాపం ఏంటీ అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు ప్రమాదంపై ఏదైతే చెప్పారో అదే మీడియా చెప్పింది. పవన్‌కు దమ్ముంటే తెలంగాణ పోలీసులను, కేసీఆర్‌ను తిట్టాలని అన్నారు. రిపబ్లిక్ ఇండియా కాబట్టే మీరు ఏం మాట్లాడినా చెలామణి అవుతుందని, కోడికత్తికేసు ఎన్ఐఏ చూస్తోందని, దమ్ముంటే కేసు వివరాలను అమిత్‌షాను అడగాలని పేర్నినాని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి మీకు అంత భయమెందుకని పేర్నినాని పేర్కొన్నారు.
Read: వైఎస్ జగన్‌కు పీఎం మోడీ ఫోన్… అండగా ఉంటామని హామీ…