బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం అల్పపీడనంగా మారి బలపడి గులాబ్ తుఫాన్‌గా మారింది. గులాబ్ తుఫాన్ ఈరోజు రాత్రికి ఒడిశాలో తీరం దాటబోతున్నది. తీరం దాటే సమయంలో భారీ ఎత్తున గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. ఇక ఒడిశాతో పాటుగా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే అధికారులు రంగంలోకి దిగి తీరప్రాంతాల్లోని ప్రజలను తరలిస్తున్నారు. ఇదిలా ఉంటే, తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పీఎం మోడీ ఆంధ్రప్రదేశ్‌కు సీఎం వైఎస్ జగన్‌కు ఫోన్ చేశారు. గులాబ్ తుఫాన్ నేపథ్యంలో తీసుకున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి అన్నిరకాల సాయం అందిస్తామని, అందరూ క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు ప్రధాని పేర్కొన్నారు.
Read: యూపీలో ప్రియాంక పర్యటన… లక్నోపైనే దృష్టి…