నెట్ వర్క్ ఉంటేనే ఫోన్ మాట్లాడుకునే వీలుంటుంది. నెట్ వర్క్ లేకుంటే ఏ మాత్రం అవకాశం ఉండదు. అయితే, ఈ ఆంశాన్ని అధికమించేందుకు యాపిల్ కంపెనీ వ్యవస్థ సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. యాపిల్ ఐఫోన్ 13 లో నెట్‌వర్క్ లేకున్నా కాల్స్ మాట్లాడుకునే అవకాశాన్ని కల్పిస్తున్నది. తక్కువ ఎత్తులో కూడా శాటిలైట్‌కు కనెక్ట్ అయ్యే విధంగా యాపిల్ ఐఫోన్ 13 ని తయారు చేస్తున్నట్టు టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ మొబైల్‌లో క్వాల్‌కోమ్ ఎక్స్ 60 […]
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న సంగతి తెలిసిందే. 1996 నుంచి 2001 వరకు తాలిబన్ల దురాక్రమణలో ఆఫ్ఘనిస్తాన్ అతలాకుతలం అయింది. 2001 నుంచి 2021 వరకు ప్రజాస్వామ్య పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు మరోసారి తాలిబన్ల వశం అయింది. దీంతో ఇప్పుడు మరలా తాలిబన్ల గురించి ప్రపంచం భయపడుతున్నది. ఆందోళన చెందుతున్నది. 1990లో తాలిబన్ల వ్యవస్థ ఏర్పాటైంది. గిరిజనుల హక్కుల పోరాటం కోసం ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రజల ప్రాణాలు రక్షించేందుకు తాలిబన్ల వ్యవస్థను 1990లో ఏర్పాటు […]
టైటానిక్ సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో చెప్పక్కర్లేదు. హీలీవుడ్ నిర్మాతలకు కాసుల పంట పండించింది. ఇక, ఆ సినిమా హీరో డికాప్రియో బీటిల్ కట్ హెయిర్ స్టైల్ అప్పట్లో యమా ఫేమస్ అయింది. టైటానిక్ సినిమా వచ్చిన సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన అమలులో ఉన్నది. అప్పట్లో ఆ హెయిర్‌స్టైల్‌ను యువత బాగా లైక్ చేసింది. చాలా మంది యూత్ ఆ హెయిర్‌స్టైల్ చేయించుకోవడానికి బార్బర్ షాపులకు క్యూలు కట్టారు. అయితే, తాలిబన్ల పాలనలో షరియా చట్టాల […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 878 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,13,001కి చేరింది. ఇందులో 19,84,301 మంది ఇప్పటికే కోలుకొని డిశ్చార్జ్ కాగా… 14,862 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏపీలో 13 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 13,838కి చేరింది. గడిచిన […]
ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారం ఇంకా ముగియకముందే ఇప్పుడు అమెరికాకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. ఇప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న ఉత్తర కొరియా ఇప్పుడు మళ్లీ అణు సమస్యలు తెచ్చిపెట్టేందుకు సిద్ధం అయింది. అణు రియాక్టర్‌ను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చినట్టు ఐక్యరాజ్యసమితి అటామిక్ ఏజెన్సీ పేర్కొన్నది. ఇది అంతర్జాతీయ అణుచట్టాలకు విరుద్ధమని ఐరాస పేర్కొన్నది. 2018లో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ తో సమావేశానికి ముందు యాంగ్‌బ్యోన్‌లోని అణు రియాక్టర్‌ను […]
దేశంలో కరోనా కేసులు పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందిస్తున్నప్పటికీ కేసులు పెరుగుతుండటంతో అన్ని రకాల కరోనా వైరస్‌లను తట్టుకునే విధంగా ఒక శక్తివంతమైన వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ పిలుపునిచ్చింది. ప్రపంచ దేశాలు ఈ విషయంలో ఒక్కటి కావాలని, అన్ని రకాల వైరస్‌లను తట్టుకునే విధంగా వ్యాక్సిన్‌లను తయారు చేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్యా స్వామినాథన్ తెలిపారు. ఈ తరహా వ్యాక్సిన్ అభివృద్ధికి ప్రపంచ దేశాలు సహకరించాలని, అభివృద్ది […]
ప్రపంచంలో ఎక్కువ మంది పిజ్జాలు తింటుంటారు. ప్రతిరోజూ కోట్లాది పిజ్జాలను ప్రజలు ఆర్డర్ చేస్తుంటారు. భూమి మీద ఎలా ఉన్నా, అంతరిక్షంలోని స్పేస్ స్టేషన్లో ఉండే వ్యోమగాములు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే, అక్కడ వారు వీలైనంత తక్కువగా ఆహారం తీసుకోవాలి. భారరహిత స్థితిలో ఉంటారు. పైగా అరుగుదల చాలా తక్కువగా ఉంటుంది. వీటన్నింటిని పక్కన పెట్టి భూమిపై ఉంటే ఎలాగైతే పార్టీ చేసుకుంటారో అదే విధంగా అంతరిక్ష కేంద్రంలో కూడా పిజ్జా పార్టీ […]
తాలిబన్లు అంటే ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఆగస్టు 15 వ తేదీన వారు ఆ దేశాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఇది జరిగిన రెండ్రోజులకు తాలిబన్ కీలక నేతను టోలో న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఛానల్ న్యూస్ యాంకర్ బెహెస్తా ఆర్ఘాండ్ అనే యాంకర్ ఇంటర్వ్యూ చేసింది. కాబూల్‌లో సోదాలు, భవిష్యత్ ప్రణాళికలు, మహిళలకు రక్షణ తదితర విషయాలపై ఆమె తాలిబన్ నేతను ప్రశ్నించింది. ఈ ఇంటర్వ్యూ పూర్తయ్యి ప్రసారం జరిగాక ఆ […]
తాలిబన్లు ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్నారు. ఆగస్టు 31 తరువాత కాబూల్ ఎయిర్‌పోర్ట్ తో సహా అన్ని తాలిబన్ల వశం కాబోతున్నాయి. ఆ తరువాత ఆ దేశం పరిస్థితి ఎలా మారిపోతుంది అన్నది అందిరిలోనూ ఉన్న ప్రశ్న. తాలిబన్లను చూసి భయపడవద్దని, తాము మారిపోయామని, తాము అందరిని సమానంగా గౌరవిస్తామని చెబుతున్నారు. అయినప్పటికీ ఎవరూ నమ్మడంలేదు. ఇక ఇదిలా ఉంటే, ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ చిన్న క్లిప్ వైరల్ అవుతున్నది. తాలిబన్ ముష్కరులు ఓ టీవీ ఛానల్‌లోకి ప్రవేశించి, […]
కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఇప్పటికీ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. వేగంగా కేసులు విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. మాస్క్ ధరించడం తప్పని సరి అని చెబుతున్నా, ప్రజలు ఆ మాటలు నెత్తికెక్కించుకోవడం లేదు. నాయకులే మాస్కులు పక్కన పెట్టి సభలు, సమావేశాలు, యాత్రలు చేస్తున్నారు. రాజు చూపిన బాటలోనే కదా ప్రజలు నడిచేది. అందుకే ప్రజలు కూడా అలానే చేస్తున్నారు. అయితే, మనుషుల కంటే తానే బెటర్ అని చెప్పకనే చెప్పింది […]