Basil Joseph: అల్లు అర్జున్‌తో బాసిల్ జోసెఫ్ మూవీ ఖాయమేనా? ఒక్క పోస్టుతో ఊహాగానాలకు చెక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Basil Joseph: గత కొంతకాలంగా మలయాళ దర్శకుడు బాసిల్ జోసెఫ్‌తో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ఫాంటసీ చిత్రంలో నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పటివరకు ఈ కాంబినేషన్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. తాజాగా బాసిల్ జోసెఫ్ సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ మాత్రం ఈ ఊహాగానాలకు తెర దించినట్లే కనిపిస్తోంది. బాసిల్ జోసెఫ్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ‘ICON’ అనే పదం ఉన్న ఒక టోపీ ఫొటోను షేర్ చేశారు. అంతేకాకుండా, ఆ పోస్ట్‌కు అల్లు అర్జున్ నటించిన ‘ఆర్య 2’ చిత్రంలోని సూపర్‌హిట్ పాట ‘రింగా రింగా’ను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా జోడించారు. దీంతో ఈ పోస్ట్ నేరుగా అల్లు అర్జున్ను ఉద్దేశించినదేనని అభిమానులు భావిస్తున్నారు.
ఈ ఒక్క సోషల్ మీడియా అప్డేట్తో అల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ కాంబినేషన్ దాదాపు ఖాయమైనట్టేనని సినీ వర్గాల్లో చర్చ మొదలైంది. అధికారిక ప్రకటన లేకపోయినా, ఈ పోస్టు వెనుక పెద్ద అప్డేట్ ఉండొచ్చని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడిగా బాసిల్ జోసెఫ్ ఇప్పటికే ‘మిన్నల్ మురళి’ వంటి సూపర్‌హిట్ ఫాంటసీ చిత్రంతో తన ప్రత్యేక ముద్ర వేశారు. వినూత్న కథలను ఎంచుకోవడంలో ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అలాంటి దర్శకుడితో అల్లు అర్జున్ జతకడితే, పాన్ ఇండియా స్థాయిలో మరో భారీ ఫాంటసీ ఎంటర్టైనర్ రూపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాసిల్ జోసెఫ్ చేసిన ఈ చిన్న పోస్టు మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పుడు నిజంగానే ఈ క్రేజీ కాంబినేషన్ పట్టాలెక్కుతుందా? అనే ప్రశ్నకు సమాధానం త్వరలోనే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కి కూడా మలయాళంలో మంచి క్రేజ్ ఉంది. వీళ్ళ కాంబినేషన్ గనుక పట్టాలేక్కితే మాత్రం ఫ్యాన్స్ కు పండగనే చెప్పాలి.
Just Dropped…💣💣🥵🥵
Basil joshep posted a icon cap with ringa ringa in his insta…
Looks like AlluArjun x Basil joshep combo is very much on track
After number of discussions and developments, AlluArjun finally satisfied with the script 😭
Announcement is expected soonnnn… pic.twitter.com/s3a2wvOJoj
— AlluArjunFANS (@AlluArjunFFANS) July 14, 2026
- Tags
- Allu Arjun
- basil joseph
- cinema
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!