సెప్టెంబర్ 13, సోమవారం దినఫలాలు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేషం : చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారానికి బాగా శ్రమిస్తారు. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరవుతారు. స్త్రీలు షాపింగ్ విషయాలలో ధనం విరివిగా వ్యయం చేస్తారు.
వృషభం : మీ జీవిత భాగస్వామి సలహా పాటించి లబ్ధి పొందుతారు. కొబ్బరి, పండ్లు, పూల, బేకరీ తినుబండారాల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు, కీలకమైన విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, అవకాశం కలిసివస్తాయి. రుణాలు చేబదుళ్ళ యత్నాలు సాగిస్తారు.
Also Read
- Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
- Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
- Gurugram: ఆమె అమ్మాయినే తెలియదు.. గురుగ్రామ్ బైకర్‌ను ఢీకొట్టిన నిందితుడు వింత వాదన
- Trump: తెలివైన అధ్యక్షుడు ఉండగా ఏఐకి కళ్లెం వేయక్కర్లేదు.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
మిథునం : అతిథి మర్యాదలు, సత్కారాలు సమర్థంగా నిర్వహిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో సామాన్య ఫలితాలనే పొందుతారు. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఊహించని ఖర్చుల వల్ల స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. ప్రముఖుల కలయిక అనుకూలించగలదు. మొండి ధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
కర్కాటకం : గృహ నిర్మాణాలు, మరమ్మతులు వాయిదపడతాయి. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పనిభారం తప్పవు. చేపట్టిన పనులు అసంపూర్ణంగా ముగించవలసి వస్తుంది.
సింహం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. మీమీ జీవిత భాగస్వామి సలహా పాటించి లబ్ధి పొందుతారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
కన్య : పోస్టల్, ఎల్ఐసీ ఏజెంట్లకు, ఇళ్ళస్థలాల బ్రోకర్లకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు వృత్తుల్లో వారికి ఒత్తిడి చికాకులు తప్పవు. సాంఘిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేరు. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది.
తుల : ఆర్థిక లావాదేవీలు, ఉమ్మడి వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. ధనం మితంగా వ్యయం చేయడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులు విధి నిర్వహణలో ఏకాగ్రతోత పని చేయవలసి ఉంటుంది. మీ అభిప్రాయాలు బయటకు వ్యక్తం చేయడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఆల్కహాలు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు.
వృశ్చికం : కిరాణా, ఫ్యాన్సీ, రసాయన, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. రుణాలు తీరుస్తారు. స్త్రీలకు అర్జనల పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కొంత కాలం వాయిదావేయడం మంచిది.
ధనస్సు : ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు, ప్రణాళికలు చేపడతారు. మీ మాటతీరు, పద్ధతి ఎదుటివారిని ఆకట్టుకుంటారు. మీ కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. విద్యార్థుల్లో మందకొడితనం, ఏకాగ్రత లోపం వంటి చికాకులు చోటుచేసుకుంటాయి.
మకరం : వస్త్ర, బంగారు, వెండి వ్యాపారస్తులకు పురోభివృద్ధి. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. రాజకీయ నాయకులకు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. దంపతుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. ఖర్చులు అధికం.
కుంభం : ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహా తీసుకోవడం మంచిది. మిత్రుల ప్రోత్సాహంతో నిరుద్యోగులు ఉపాధి పథకాలు చేపడతారు. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆదాయం ఆశించనంతగా ఉండదు. ఒక స్థిరాస్తిని అమర్చుకునే విధంగా మీ ఆలోచనలుంటాయి. దైవ, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.
మీనం : మీ వాగ్ధాటితో ప్రముఖులను, అధికారులను ఆకట్టుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. వాతావరణంలో మార్పు వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. గ్రహాల అనుకూలత వల్ల కార్యసిద్ధి. వ్యవహార జయం పొందుతారు. సంఘంలో ప్రత్యేక గుర్తింపు, గౌరవం ఏర్పడతాయి.
తాజావార్తలు
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
Disha Salian Death Case: ‘నేను ఇకపై మౌనంగా ఉండను’… దిశా సాలియన్ కేసుపై మౌనం వీడిన సూరజ్ పంచోలి
-
Asia Cup Trophy Row: నఖ్వీతో ప్రొఫెషనల్ ఇంటరాక్షన్ మాత్రమే.. సైకియాపై విమర్శలు వద్దు: బీసీసీఐ
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!