ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల పాలన మొదలైంది. మహిళల విషయంలో తాలిబన్లు కాస్త మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నారు. చదువుకునేందుకు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారు. ఇక, ఉద్యోగాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. అయితే, కొంత మంది మహిళలు ధైర్యంతో ఉద్యోగాల్లో చేరేందుకు ముందుకు వస్తున్నారు. కాబూల్ ఎయిర్‌పోర్ట్ తిరిగి తెరుచుకోవడంతో అక్కడ 12 మంది మహిళలు తిరిగి ఉద్యోగాల్లో చేరారు. కాబూల్ ఎయిర్‌పోర్ట్‌లోని చెకింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఈ మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. కుటుంబం పోషణ జరగాలంటే ఉద్యోగం చేయాలని, ఉద్యోగానికి వెళ్లకుంటే ఒత్తిడి పెరుగుతుందని, అందుకో ఉద్యోగంలో చేరినట్టు మహిళలు చెబుతున్నారు. ఉద్యోగాల్లో చేరిన తరువాత కొంత ఒత్తిడి తగ్గిందని, అయితే, తమ ప్రాణాలకు గ్యారెంటీ లేదని, ధైర్యంగా పోరాటం చేస్తామని మహిళలు చెబుతున్నారు. అనేక ప్రాంతాల్లో మహిళలు ఇప్పటికే రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
Read: సెప్టెంబర్ 13, సోమవారం దినఫలాలు…