దెయ్యం ఎలా ఉంటుంది అంటె ఫలానా అకారంలో ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. అయితే, అవి ఉన్నచోట కొన్ని వస్తువులు ఆటోమాటిక్‌గా కదులుతుంటాయి. చాలామంది దెయ్యాలు ఉన్నాయంటే అసలు నమ్మరు. దెయ్యాలను నమ్మని ఓ మహిళ లండన్‌లోని ది లాన్స్ డౌన్ అనే పబ్‌కు వెళ్లింది. అలా వెళ్లిన ఆ మహిళ ఓ కుర్చీలో కూర్చున్నది. టేబుల్ చుట్టూ ఉన్న మూడు కుర్చీలు ఖాళీగా ఉన్నయి. ఎన్నట్టుండి ఎదురుగా ఉన్న కుర్చీ ముందుకు కదిలింది. దీంతో షాకైన ఆ మహిళ కుర్చి కింద ఏమైనా ఉన్నాయేమో అని చూసింది. కానీ ఏమీ లేకపోవడంతో వెంటనే వెళ్లి విషయాన్ని మేనేజ్‌మెంట్‌కు తెలియజేసింది. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలను చూసి షాకైంది. ఎవరూ లేకుండానే కుర్చీ ముందుకు కదిలినట్టు సీసీ టీవీలో రికార్డ్ అయింది. వెంటనే ఆ మహిళ భయంతో పరుగులు తీసింది. ఇదే పబ్‌లో కొన్ని రోజుల క్రితం గోడకు తగిలించిన కార్డ్‌బోర్డ్ తనంతట అదే అటూఇటూ ఊగిన దృశ్యాలు కూడా సీసీటీవిలో రికార్డ్ అయ్యాయి. అయితే, పబ్‌లో ఉన్న దెయ్యాలు ఏమీ చేయడం లేదని యాజమాన్యం చెబుతున్నది.
Read: గుజరాత్ సీఎంగా నేడు భూపేంద్ర పటేల్ ప్రమాణస్వీకారం…