సరిగ్గా 41 ఏళ్ల క్రితం అంటే 1980లో ఇరాక్ -ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దాదాపుగా 10 లక్షల మందికి పైగా మృతి చెంది ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం బహుశా ఈ యుద్ధం సమయంలోనే జరిగి ఉంటుంది. రెండు దేశాల మధ్య దాదాపుగా 8 ఏళ్లపాటు ఈ యుద్ధం జరిగింది. అసలు రెండు దేశాల మధ్య యుద్ధం జరగడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం. 1979 లో ఇస్లామిక్ […]
మైక్రోబ్లాగింగ్ ట్విట్టర్ సంస్థ తనపై ఉన్న కేసును పరిష్కరించుకోవాడానికి ముందుకు వచ్చింది. ట్విట్టర్ వినియోగదారుల సంఖ్యను ఎక్కువ చేసి చూపించిందని, పెట్టుబడి దారులను ఆకర్షించేందుకు 2014లో ఇలా తప్పుడు లెక్కలు చూపిందని 2016లో డోరిస్ షెన్ విక్ కోర్టులో కేసును ఫైల్ చేశాడు. దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతున్నది. అయితే, ఈ కేసును పరిష్కరించుకోవడానికి ట్విట్టర్ సిద్ధం అయ్యింది. ఈ కేసు పరిష్కారం కోసం రూ. 5971 కోట్ల రూపాయలు చెల్లిస్తామని ట్విట్టర్ పేర్కొన్నది. 2021 నాలుగో త్రైమాసికంలో ఈ మొత్తాన్ని చెల్లిస్తామని ట్విట్టర్ […]
ప్రధాని మోడీ ఈరోజు అమెరికా బయలుదేరి వెళ్లారు. ఈనెల 23 న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ తోనూ, ఆ తరువాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తోనూ ప్రధాని సమావేశం కానున్నారు. ఇతర దేశాలకు వెళ్ళాలి అంటే తప్పనిసరిగా వాక్సిన్ తీసుకొని ఉండాలి. అందులోనూ ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తింపు పొందిన ఏడు రకాల వ్యాక్సిన్లలో ఏదో ఒకటి తీసుకొని ఉండాలి. ఇండియాలో సొంతంగా అభివృద్ధి చేసిన కోవాక్సీన్ ను ప్రపంచ ఆరోగ్యసంస్థ ఇప్పటి వరకు గుర్తించలేదు. ఇండియాలో తయారైన ఈ వ్యాక్సిన్ ను ప్రధానితో పాటుగా అనేక […]
ప్రపంచం నుంచి కరోనా ఇంకా దూరం కాలేదు. అమెరికా వంటి దేశాల్లో కరోనా ఉధృతంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రతి రోజూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రెండు వేలకు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ వేగంగా అమలు చేస్తుంటే కొన్ని చోట్ల వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రజలు ముందుకు రావడం లేదు. వ్యాక్సిన్ ను వ్యతిరేకిస్తున్నారు. కరోనా నుంచి బయట పడలేదు కాబట్టి తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని ప్రభుత్వం ప్రజలకు పదేపదే విజ్ఞప్తి చేస్తూ వస్తున్నది. […]
ఈరోజు నుంచి న్యూయార్క్ లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాలు జరగబోతున్నాయి. ఈ సమావేశాలకు అన్ని దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకాబోతున్నారు. కాగా, ఈ సదస్సు జరిగే సమయంలోనే సార్క్ దేశాలకు చెందిన విదేశాంగ శాఖ మంత్రులు సమావేశం కావాలని ముందుగా నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆఫ్గనిస్తాన్ లో ప్రస్తుతం తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సార్క్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశానికి తాలిబన్లను కూడా పిలవాలని పాక్ కొత్త మెలిక పెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లో నెలకొన్న ప్రస్తుత […]
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. టీటీడీ పాలక మండలిలో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై హైకోర్టులో వేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ జరిగింది. ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను కొట్టివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. టీటీడీలో జంబో బోర్డును నియమించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో […]
చైనాలో రియల్ ఎస్టేట్ దిగ్గజం ఎవర్ గ్రాండే పెద్ద 300 బిలియన్ డాలర్ల ఎప్పుతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఏ క్షణంలో అయినా ఈ కంపెనీ దివాళా తీసే అవకాశం ఉండటంతో చైనాలోని రియల్ ఎస్టేట్ కంపెనీలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు వాటిని ఉపసంహరించుకుంటున్నారు. దీంతో ఓ వెలుగు వెలిగిన దిగ్గజ రియల్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుదేలయ్యారు. లక్షల కోట్ల రూపాయలు క్షణాల వ్యవధిలో హాం ఫట్ అయ్యింది. చైనాకు చెందిన […]
ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా దేశంలో 26,964 కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 383 మంది మృతి చెందారు. దేశంతో మొత్తం ఇప్పటి వరకు 3,27,83,741 మంది కోలుకొని డిశ్చార్జ్ అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో కరోనాతో ఇప్పటి వరకు 4,45,768 మంది మృతి చెందారు. దేశంలో 3,01,989 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు పెరుగుతుండటంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కరోనా మహమ్మారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని, […]
ప్రధాని మోడీ ఈరోజు అమెరికా పర్యటనకు బయలుదేరబోతున్నారు. ప్రధాని మోడీతో పాటుగా అయన బృందంలో విదేశీ వ్యవహరాల మంత్రి ఎస్.జయశంకర్, విదేశీ వ్యవహరాల కార్యదర్శి హెచ్.వి. శ్రింగ్లా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు, భారత ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. సెప్టెంబర్ 23 వ తేదీన అస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాన మంత్రి యోషిహిదె సుగ లతో విడివిడిగా ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహించనున్నారు. యాపిల్ సీఈవో టీమ్ కుక్ తో పాటుగా అనేక అమెరికా […]
గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి దాదాపుగా 8 లక్షలకు పైగా యాప్ లను నిషేదించారు. పిక్సలేట్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా గూగుల్, యాపిల్ స్టోర్ల నుంచి యాప్ లను నిషేధం విధించారు. హెచ్ 1 2021 డిలిస్టెడ్ పేరుతో పిక్సలేట్ ఓ నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ఆధారంగా మొత్తం 8,13,000 యాప్ లపై నిషేధం విధించింది. ఇందులో 86 శాతం చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకొని సైబర్ దాడులకు పాల్పడుతున్నాయని నివేదికలో పేర్కొన్నది. కెమెరా, […]