తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. రాష్ట్రంలో మాంసం ధరలను నియంత్రించేందుకు, అందరికీ పరిశుభ్రమైన మాంసాన్ని అందించేందుకు రాష్ట్ర పశువర్థక శాఖ కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. రాష్ట్రంలోని అన్ని మాంసం దుకాణాలను ప్రభుత్వం పరిధిలోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది పశువర్ధక శాఖ. రాష్ట్రంలో కబేళాలను ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఒకటి లేదా రెండు చొప్పున, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రతి జోన్‌లో ఒకటి చొప్పున వధశాలలను ఏర్పాటు చేసివాటిని […]
ప్రపంచంలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. కరోనా వైరస్ అనేక విధాలైన వేరియంట్‌లుగా రూపాంతరం చెందుతున్నాయి. ఇందులో ఆల్ఫా, గామా, బీటా, కప్పా వేరియంట్‌లు ప్రస్తుతం పెద్దగా ప్రభావం చూపడం లేదు. ప్రపంచం మొత్తాన్ని ఇప్పుడు డెల్టా వేరియంట్ వణికిస్తోంది. ప్రపంచంలో నమోదవుతున్న కేసుల్లో 90 శాతం డెల్టా వేరియంట్ కేసులు ఉండటం విశేషం. కరోనా మహమ్మారి నుంచి బయటపడేందుకు టీకాలు తీసుకుంటున్నా, ఈ వేరియంట్ కేసులు టీకాలు తీసుకోని వారికి, తీసుకున్న వారికి సోకుతున్నది. 185 […]
కరోనా కాలంలో ప్రపంచంలోని చాలా దేశాల్లో లాక్‌డౌన్ విధించారు. ఇప్పటికీ ఇంకా అనేక దేశాల్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉన్నది. డెల్టా వేరియంట్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఆస్ట్రేలియాలో ఫిబ్రవరి నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అటు ఫ్రాన్స్‌లోనూ కరోనా ఇబ్బందులు పెట్టింది. అత్యవసరంగా ప్రయాణం చేయాలి అనుకున్నా కుదరక ఉన్నచోటనే కోట్లాది మంది ఉండిపోయారు. ఆస్ట్రేలియాకు చెందిన ఫోల్డ్ అనే వ్యక్తి కరోనా కారణంగా ఫ్రెంచ్ […]
మేషం:- ప్రైవేటు సంస్థలలోని వారు భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరించండి. ముఖ్యల రాకతో మీలో నూతనోత్సాహం నెలకొంటుంది. వృత్తి వ్యాపారులకు శుభదాయకం. చెడు అలవాట్లకు, స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. మీ తెలివి తేటలకు వాక్చాతుర్యానికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వృషభం:- నిత్యవసర వస్తువ్యాపారులకు స్టాకిస్టులకు కలిసిరాగలదు. నూతన వ్యక్తుల పరిచయం మీకెంతో సంతృప్తి నివ్వగలదు. స్త్రీలు మొండివైఖరి అవలంభించడం వల్ల మాటపడవలసి వస్తుంది. విద్యార్థుల ఆలోచనలు పక్కదోవ పట్ట కుండా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. […]
ఇప్పటి వరకు మనదేశం రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై అధారపడుతూ వచ్చింది. అయితే, ఆత్మనిర్భర్ భారత్ పేరుతో స్వదేశీ వస్తువులను కేంద్రం ప్రోత్సహిస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా రక్షణ వ్యవస్థకు సంబందించి అనేక ఆయుధాలను ప్రస్తుతం సొంతంగా ఇండియాలోనే తయారు చేసుకుంటున్నారు. మెషిన్ గన్, తేలికపాటి యుద్ధ విమానాలు, ఇతర ఆయుధాలను, క్షిపణులను ఇండియాలోనే తయారు చేసుకుంటున్నారు. అంతేకాదు, యుద్ధ షిప్పులు, జలాంతర్గాములు వంటివి కూడా ఇండియాలోనే తయారవుతున్నాయి. కాగా, ఇప్పుడు ఇండియా సొంత టెక్నాలజీతో […]
భారత్‌లోని పలు రాష్ట్రాల్లో ఉగ్రవాదులు దాడులు చేసేందుకు కుట్రలు చేస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చిరించాయి. భారత్‌లోని చొరబడేందుకు 40మంది ఆఫ్ఘన్ ఉగ్రవాదులు పన్నాగం పన్నుతున్నట్టు నిఘా వర్గాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించాయి. పాకిస్తాన్ గూడాచార సంస్థ ఐఎస్ఐ మద్ధతుతో భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని హెచ్చిరించాయి. జమ్మూకాశ్మీర్ గుండా దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి. దేశంలో రాబోయే పండగ రోజుల్లో దాడులు చేసేందుకు పన్నాగం పన్నుతున్నట్టు […]
దేశంలో జనాభా పెరిగిపోతుండటంతో నగరీకరణ పెరుగుతున్నది. ఫలితంగా రోడ్లపై ట్రాఫిక్ భారీగా పెరుగుతున్నది. కిలోమీటర్ దూరం ప్రయాణానికి గంటల సమయం పడుతున్నది. ఇక అంబులెన్స్ వంటి వాహనాలు ట్రాఫిక్‌లో ఇరుక్కుంటే పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. ఎగిరిపోయే కార్లు వస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంటుంది. అలాంటి ఎగిరే కార్లు త్వరలోనే దేశంలో అందుబాటులోకి రాబోతున్నాయి. ఆసియాలోనే మొదటి ఎగిరే కారు ఇండియాలోనే తయారు కాబోతున్నది. ఇండియన్ స్టార్టప్ సంస్థ వినతా ఏరోమొబిలిటీ ఆఫ్ ఇండియా […]