ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్ కు కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య అబుదాబి వేదికగా మ్యాచ్ జరుగుతున్నది. కొద్దిసేపటి క్రితమే టాస్ వేయగా, కోల్‌కతా జట్టు టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకున్నది. ఇప్పటికే ముంబై జట్టు తన మొదటి మ్యాచ్‌లో చైన్నైపై ఓటమి పాలైంది. ఎలాగైనా ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నది. అయితే, కోల్‌కతా జట్టు బెంగళూరుపై అద్భతమైన విజయాన్ని సొంతం చేసుకొని అదే దూకుడును ఈ మ్యాచ్‌లోనూ ప్రదర్శించాలని […]
వచ్చే ఏడాది దేశంలో 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో గోవా కూడా ఒకటి. దేశంలో బీజేపీని ఎలాగైనా ఓడించాలనే లక్ష్యంతో ప్రతిపక్షాలన్ని కలిసికట్టుగా ప్రయత్నం చేస్తున్నాయి. బెంగాల్ ఎన్నికల తరువాత దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలు ఒక్కటిగా కలిసి పనిచేసుందుకు ముందుకు వస్తున్నాయి. కాగా గోవాలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉండటంతో బీజేపీకి ఇప్పటి వరకు కలిసి వచ్చింది. కాంగ్రెస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఆప్ ఇప్పటికే రంగంలోకి […]
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో 55,251 శాంపిల్స్‌ను పరిక్షించగా 1171 మంది పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,43,244కి చేరింది. ఇందులో 20,15,387 మంది కోలుకొని ఇప్పటికే డిశ్చార్జ్ అయ్యారు. 13,749 కేసులు ప్రస్తుతం యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 11 మంది మృతి చెందినట్టు ఏపీ ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో […]
ఇండో పసిఫిక్ తీరంలో చైనా ప్రాభల్యాన్ని తగ్గించేందుకు తక్షణమే ఓ బలమైన కూటమి అవసరం ఉందని భావించిన అగ్రరాజ్యం అమెరికా అటు బ్రిటన్, ఆస్ట్రేలియాతో కలిసి అకూస్ కూటమిని ఏర్పాటు చేసింది. ఈ కూటిమి ఏర్పడటం వలన గతంలో ఫ్రాన్స్‌తో ఆస్ట్రేలియా 12 జలాంతర్గాముల కోసం చేసుకున్న ఒప్పందం వీగిపోయింది. దీనికి బదులుగా అమెరికా అస్ట్రేలియాకు అధునాతనమైన అణుజలాంత్గాములను సరఫరా చేస్తుంది. దీనిపై ఆస్ట్రేలియా, అమెరికాపై ఫ్రాన్స్ మండిపడింది. ఇక ఇదిలా ఉంటే ఆసియాలో చైనా ప్రాభల్యం […]
పంజాబ్ కొత్త సీఎంగా చరణ్‌జిత్ చన్ని ఇటీవలే ప్రమాణస్వీకారం చేశారు. తన టీమ్‌లో కొత్త మంత్రి వర్గాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. వచ్చే ఏడాది పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జగరబోతున్న తరుణంలో రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలను తగ్గించేందుకు ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను పక్కకు తప్పించి ఆయన స్థానంలో దళిత సామాజిక వర్గానికి చెందిన చరణ్ జిత్ సింగ్ చన్ని ని ముఖ్యమంత్రిగా నియమించారు. దీంతో కొంతమేర అక్కడ అంతర్గత విభేదాలు తగ్గుముఖం పడతాయని కాంగ్రెస్ […]
చాలా కాలం తరువాత స్టాక్ మార్కెట్లు భారీగా లాభ పడ్డాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభం అయినప్పటి నుంచి భారీ లాభాల్లో దూసుకుపోయాయి. సెన్సెక్స్ ఒకదశలో వెయ్యి పాయింట్ల మార్కును దాటి రికార్డు సృష్టించింది. ఉదయం సెన్సెక్స్ 59,275 పాయంట్లతో ప్రారంభమయ్యి లాభాల దూకుడును ప్రదర్శించి 985.03 పాయింట్ల లాభంతో 59,885.36 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్ తో పాటుగా నిఫ్టి కూడా దూకుడు ప్రదర్శించింది. 276.30 పాయింట్ల లాభంతో 17,823 పాయింట్ల వద్ద ముగిసింది. అమెరికా ఫెడ్ […]
ఒకప్పుడు స్పేస్ లోకి వెళ్లడం అంటే చాలా ఖరీదైన విషయం. కేవలం వ్యోమగాములకు మాత్రమే అవకాశం ఉండేది. కానీ, టెక్నాలజీ పెరిగిపోవడం, స్పేస్ రంగంలోకి ప్రైవేట్ సంస్థలు ప్రవేశంచడంతో స్పేస్ టూరిజం మరింత ముందుకు కదిలింది. ఇప్పటికే వర్జిన్ గెలాక్టిక్, అమెజాన్ బ్లూ ఆరిజిన్, స్పేస్ ఎక్స్ సంస్థలు అంతరిక్ష పరిశోధన రంగంలోకి దిగడంతో పోటీ పెరిగింది. ఇప్పిటికే ఈ మూడు సంస్థలు సొంతంగా తయారు చేసుకున్న రాకెట్ల ద్వారా స్పేస్‌లోకి వెళ్ళొచ్చారు. కాగా, స్పేస్ టూరిజం […]
ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తాలిబన్లు ప్రపంచ గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారు. మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే తాలిబన్లకు పాక్ ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రభుత్వం ఏర్పాటులో ఆ దేశం కీలక పాత్ర పోషించినట్టు ఇప్పటికే అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, దోహ ఒప్పందం ప్రకారం సమీకృత ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. కానీ, ఆఫ్ఘనిస్తాన్ దానికి విరుద్ధంగా తాలిబన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వంలో హమీద్ కర్జాయ్, అబ్దుల్లా అబ్దుల్లా వంటి సీనియర్ […]
ఉదయాన్నే చాలా మంది చిన్నారులు పేపర్ వేస్తూ కనిపిస్తుంటారు. వివిధ కారణాల వలన బాల్యం నుంచే కష్టపడి పనిచేయాల్సి వస్తుంటుంది. జగిత్యాల పట్టణానికి చెందిన జయప్రకాశ్ అనే విద్యార్థి ఉదయాన్నే పేపర్ వేస్తుండగా ఓ వ్యక్తి చదువుకునే వయసులో పేపర్ ఎందుకు వేస్తున్నావ్ అని ప్రశ్నించగా, తప్పేముంది, పేపర్ వేస్తూ చదువుకోకూడగా అని ఎదురు ప్రశ్నించారు. చిన్నతనం నుంచి కష్టపడి పనిచేస్తూ చదువుకుంటే పెద్దయ్యాక ఏ పని చేయాలన్నా కష్టం అనిపించదు. అని సమాధానం చెప్పాడు. దీనిని […]