గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ల నుంచి దాదాపుగా 8 లక్షలకు పైగా యాప్ లను నిషేదించారు. పిక్సలేట్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా గూగుల్, యాపిల్ స్టోర్ల నుంచి యాప్ లను నిషేధం విధించారు. హెచ్ 1 2021 డిలిస్టెడ్ పేరుతో పిక్సలేట్ ఓ నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ఆధారంగా మొత్తం 8,13,000 యాప్ లపై నిషేధం విధించింది. ఇందులో 86 శాతం చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకొని సైబర్ దాడులకు పాల్పడుతున్నాయని నివేదికలో పేర్కొన్నది. కెమెరా, జీపీఎస్ ఆధారంగా యూజర్ల డేటాను సేకరిస్తున్నారని నివేదికలో పేర్కొన్నది. గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్లలో యాప్ లను నిషేధించినా, ఆయా యాప్ లను ఇప్పటికే మొబైల్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకొని ఉంటె అలాగే ఉంటాయని, మొబైల్ ఫోన్ లో ఉన్న యాప్ లు స్టోర్లలో ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని, ఒకవేళ ప్లే స్టోర్లలో లేకుంటే వెంటనే వాటిని డిలీట్ చేయాలని టెక్ నిపుణులు చెప్తున్నారు.
Read: ఏడు రోజులకు బిర్యానీకి రూ.27 లక్షల బిల్లు… షాకైన అధికారులు…!!