సరిగ్గా 41 ఏళ్ల క్రితం అంటే 1980లో ఇరాక్ -ఇరాన్ దేశాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దాదాపుగా 10 లక్షల మందికి పైగా మృతి చెంది ఉంటారని గణాంకాలు చెబుతున్నాయి. రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం బహుశా ఈ యుద్ధం సమయంలోనే జరిగి ఉంటుంది. రెండు దేశాల మధ్య దాదాపుగా 8 ఏళ్లపాటు ఈ యుద్ధం జరిగింది. అసలు రెండు దేశాల మధ్య యుద్ధం జరగడానికి కారణం ఏంటి? తెలుసుకుందాం. 1979 లో ఇస్లామిక్ విప్లవం కారణంగా ఇరాన్ లో ఆయతుల్లా ఖొమైనీ అధికారంలోకి వచ్చారు. అయితే, ఇరాన్ పక్కనే ఉన్న ఇరాక్ లో సద్దాం హుస్సేన్ పాలన కొనసాగుతున్నది. అయన సున్ని తెగకు చెందిన వ్యక్తి కావడంతో షియాలపై దాడులు చేస్తారని, ఇస్లామిక్ విప్లవం కారణంగా తన అధికారం ఎక్కడ పోతుందో అనే భయంతో ఆయతుల్లా ఇరాక్ పై దాడులు చేసేందుకు ప్రయత్నించారు. సద్దాం హుస్సేన్ ను గద్దె దించేందుకు పథకాలు వేశారు. ఈ విషయాన్ని పసిగట్టిన సద్దాం హుస్సేన్ ముందుగానే స్పందించి షట్ అల్ అరబ్ కాలువపై వివాదం వచ్చింది అని చెప్పి దాడులు చేశారు. మామూలు సైనిక చర్యలతో పాటుగా రాసాయన ఆయుధాలు కూడా వినియోగించారు. దీనిపై ఐరాస మండిపడింది. ఇక ఇరాన్ కు మద్దతుగా ఇజ్రాయిల్ రంగంలోకి దిగి బాగ్దాద్ సమీపంలోని అణురియాక్టర్లపై బాంబుల వర్షం కురిపించింది. అయితే, ఇరాక్ కు అమెరికాతో పాటుగా కొన్ని పశ్చిమ దేశాలు మద్దతుగా నిలిచాయి. ఈ యుద్ధం కారణంగా ఇరాన్ – ఇరాక్ దేశాలు భారీగా దెబ్బతిన్నాయి. ఇప్పటికీ ఈ యుద్ధంపై రెండు దేశాలు నిందించుకుంటూనే ఉన్నాయి.
Read: ఆ సమస్య పరిష్కరానికి రూ. 5971 కోట్లు చెల్లించేందుకు సిద్దమైన ట్విట్టర్