కరోనా ఇప్పటి వరకు పూర్తిగా తొలగిపోలేదు. నిత్యం కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. భారత్‌తో సహా చాలా దేశాల్లో ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నిబంధనలు పాటిస్తూనే ఉన్నారు. అయితే, ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుండటంతో మరణాల రేటు, ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తగ్గుముఖం పడుతున్నది. వ్యాక్సిన్ తీసుకోవడం, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం వంటి అంశాల కారణంగా కరోనాను అదుపులో ఉంచవచ్చు. అయితే, కరోనా పూర్తిగా ఎప్పటి వరకు అంతం అవుతంది అనే విషయంపై ఇప్పటి వరకు ఇంకా క్లారీటీ రాలేదని, కరోనా మహమ్మారి రాబోయే రోజుల్లో ప్లూగా మారే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ శాస్త్రవేత్తలు చేబుతున్నారు. బూస్టర్ డోసులను ఈ ఏడాది చివరి వరకు ప్రపంచ ఆరోగ్యసంస్థ మారటోరియం విధించడం వలన ప్రపంచంలోని 40 శాతం మంది ప్రజలకు కరోనా టీకాలు ఇవ్వవచ్చని ప్రపంచ ఆరోగ్యసంస్థ శాస్త్రవేత్త పూనమ్ ఖత్రేపాల్ సింగ్ పేర్కొన్నారు.