ప్రకృతి నుంచి మనిషి ఎన్నో తెలుసుకుంటూ, నేర్చుకుంటూ ఉంటారు. పక్షలు చెట్లపై గూళ్లు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి. ఆ గూళ్లను ఆధారంగా చేసుకొని ఇప్పుడు మనిషి చెట్లపై గూళ్లు లాంటి హోటళ్లు నిర్మించడం మొదలుపెట్టారు. క్యూబాలోని అడవుల్లో ప్రయోగాత్మకంగా ఎత్తైన చెట్లపై ట్రీ టాప్ హోటళ్లను నిర్మించారు. ఈ హోటళ్లలో అధునాతనమైన లాంజ్‌లు, గదులు ఉన్నాయి. ఒక ట్రీ టాప్ నుంచి మరోక ట్రీ టాప్ కు వెళ్లేందుకు మధ్యలో చెక్క వంతెనలు ఏర్పాటు చేశారు. వెలిజ్ ఆర్కిటెక్టో అనే వ్యక్తి ఈ హోటళ్లకు శ్రీకారం చుట్టారు. ప్రశాంతతకు నిలయమైన ఈ హోటళ్లు ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి.
Amazing hotel complex in Cuba located on the trees of a forest where individual nests are connected by wooden suspension bridges. Looks like a haven of peace and tranquility! Architect: Veliz Arquitecto pic.twitter.com/s5lBDJYWaL
— Harsh Goenka (@hvgoenka) October 10, 2021
Read: భారత్‌లో మరో ప్రైవేట్ ఎయిర్‌లైన్స్‌కు గ్రీన్ సిగ్నల్…