లఖింపూర్ ఘటన తరువాత కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. రైతుల విషయంలో, దళితుల విషయంలో బీజేపీ అరాచకాలు సృష్టిస్తోందని, బీజేపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు యూపీలోని లఖింపూర్ బాధితులను పరామర్శించిన తరువాత యూపీలో పెద్ద ఎత్తున సభలు ఏర్పాటు చేసి విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీనిపై బీజేపీ నేత ఎదురుదాడి మొదలుపెట్టారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్, మహారాష్ట్రతో పాటుగా ఇరత రాష్ట్రాల్లో దళితులపై దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ నేతలైన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎందుకు పర్యటించడం లేదని ప్రశ్నిస్తున్నారు. దేశంలోని రైతులపైనా, దళితులపైనా కాంగ్రెస్ నేతలకు నిజంగా గౌరవం ఉంటే అయా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న దాడులపై కూడా స్పందించాలని, ఆయా రాష్ట్రాల్లో వారిపై జరుగుతున్న దాడులను కూడా ఖండించాలని బీజేపీ నేతలు చెబుతున్నారు. రాజకీయం కోసమే కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తోందని నేతలు ఆరోపిస్తున్నారు.
Read: హరీష్‌పై రఘునందన్ సంచలన వ్యాఖ్యలు.. 6 నెలల తర్వాత ఔట్..!