దేశంలో నెలకొన్న బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని పలు రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నిన్నటి రోజున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రులతో సమావేశం నిర్వహించారు. దేశంలో బొగ్గు సంక్షోభం లేదని, తగినంత బొగ్గు నిల్వలు ఉన్నాయని ప్రకటించారు. కాగా, ఈరోజు ప్రధాని మోడి అధ్యక్షతన మరోసారి సమీక్ష నిర్వహించబోతున్నారు. విద్యుత్, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శులతో ప్రధాని సమీక్షను నిర్వహిస్తున్నారు. దేశంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలు తీవ్రమైన బొగ్గు కొరతను ఎదుర్కొంటున్నాయంటూ దేశరాజధాని ఢిల్లీతో సహా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్ తదితర రాష్ట్రాలు బొగ్గు సమస్యను ఎదుర్కొటున్నాయి. ఇక ఇదిలా ఉంటే, విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు నాలుగు రోజులకు కూడా సరిపోని కేంద్రాలు 70 కి పెరిగిపోవడంతో ఆయా రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి.
Read: చెట్టుపైన గూళ్లు…కాదు ఇవి హోటళ్లే…