కరోనా కారణంగా విమానాలపై పలు ఆంక్షలు విధించని సంగతి తెలిసిందే. కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో ఆంక్షలను ఒక్కొక్కటిగా సడలిస్తూ విమానాలను నడుపుతున్నారు. కాగా, అక్టోబర్ 18 వ తేదీనుంచి పూర్తి స్థాయి సీటింగ్‌తో విమానాలను నడిపేందుకు పౌరవిమానాయ మంత్రిత్వ శాఖ అనుమతులు మంజూరు చేసింది. కరోనా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో పరిమితిపై ఉన్న ఆంక్షలను తొలగించింది. మే 25, 2020 న 33 శాతం సీటింగ్‌తో దేశీయ విమానాలకు అనుమతులు ఇవ్వగా, ఆ తరువాత క్రమంగా దానిని డిసెంబర్ నాటికి 80 శాతానికి పెంచింది. అయితే, దేశంలో మళ్లీ కేసులు పెరగడంతో జూన్ 1, 2021నుంచి దానిని 50 శాతానికి తగ్గించింది. ఆగస్ట్ 12 తరువాత దానిని 72 శాతానికి పెంచింది. సెప్టెంబర్‌లో 85 శాతం సీటింగ్‌కు అనుమతులు ఇవ్వగా, అక్టోబర్ 18 నుంచి పూర్తస్థాయి సీటింగ్‌కు అనుమతులు ఇవ్వడంతో విమానయాన సంస్థలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి.
Read: వినియోగదారులకు షాకిచ్చిన పుత్తడి…