సాధారణంగా కార్లు పెట్రోల్, డీజిల్ తో నడుస్తుంటాయి. ప్రస్తుతం వాతావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ కార్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే, బ్రిటన్ యువరాజు ఛార్లెస్ నడిపే కారు మాత్రం అన్నింటి కంటే డిఫరెంట్‌గా నడుస్తుంది. బ్రిటన్ యువరాజు ఛార్లెస్‌కు 51 ఏళ్ల క్రితం ఆస్టిన్ మార్టిన్ కారును బహుమతిగా ఇచ్చారు. ఆ కారంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. ఆ కారును ఇప్పటికి మోడలింగ్ చేయించి వినియోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ కారు పెట్రోల్, డిజిల్ కాకుండా మద్యంతో నడిచే విధంగా మార్చివేశారు. ఇంజనీర్లు ఎంతో శ్రమించి ఇలా కారు ఇంజిన్ ను డిజైన్ చేసింది. బకింహామ్ ప్యాలెస్‌లో మిగిలిపోయిన వైన్‌ను కారులో ఇంధనం మాదిరిగా వినియోగిస్తున్నారు. అంతేకారు, ఈ కారులో జున్ను తయారు చేసే సమయంలో విరిగిపోయన పాలను కూడా ఇంధనంగా వినియోగిస్తున్నారట. ఈ విషయాలను ప్రిన్స్ ఛార్లెస్ స్వయంగా పేర్కొన్నారు. కర్భన ఉద్గారాలను తగ్గించేందుకు తన వంతుగా ఇలా చేస్తున్నట్టు ఆయన ఓ అంతర్జాతీయ మీడియాకు తెలిపారు.
Read: రతన్ టాటాకు అరుదైన బహుమతి… ఎందుకంటే…