ప్రధాని మోడి 2014లో ఛాయ్‌పే చర్చ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతం అయింది. ఇండియాకు వచ్చే ఇతర దేశాల ప్రతినిధులు, మంత్రులు, అద్యక్షులతో ఛాయ్‌పే చర్చ కార్యక్రమం ద్వారా చర్చలు జరుపుతుంటారు. ప్రధాని తీసుకొచ్చిన ఈ కార్యక్రమాన్ని స్పూర్తిగా తీసుకొని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చాయ్‌పే చర్చాగోష్టి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉడిపి జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడి యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో మాట్లాడారు. వారి బిజినెస్ ఐడియాల గురించి చర్చించారు. త్వరలోనే అన్ని జిల్లాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి యువ వ్యాపారవేత్తలను ప్రొత్సహిస్తామని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు.
Read: లైవ్: బాలకృష్ణతో మోహన్ బాబు, మంచు విష్ణు భేటీ