వైన్ ఎప్పటి నుంచి ప్రపంచంలో అందుబాటులో ఉన్నది అంటే ఖచ్చితంగా చెప్పడం కష్టం. పూర్వ కాలంలో వైన్‌ను వివిధ రకాలుగా తయారు చేసుకునేవారు. వాటికి సంబంధించిన ఆనవాళ్లను పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తిస్తూనే ఉన్నారు. అయితే, ప్రపంచంలోనే అతి పురాతనమైన, అతిపెద్ద వైన్ ఫ్యాక్టరీని పురాతత్వ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైన్ ఫ్యాక్టరీ బైజంటైన్ కాలానికి చెందినదిగా ఇజ్రాయిల్ పరిశోధకులు చెబుతున్నారు. సుమారు 1500 ఏళ్ల నాటిదని, అప్పట్లో ఇదే అతిపెద్ద ఫ్యాక్టరీ అని పరిశోధకులు చెబుతున్నారు. ప్రతిఏటా ఈ వైన్ ఫ్యాక్టరీ ద్వారా 20 లక్షల లీటర్ల వైన్ తయారు చేసేవారని, తవ్వకాల్లో బయటపడ్డ ఈ ఫ్యాక్టరీలో మద్యం నిల్వ చేసేందుకు వేర్ హౌస్‌లు వంటివి కూడా ఉన్నాయని తెలిపారు.
Read: ఏపీలో దిగొస్తున్న కోడి…