ఉత్తరాఖండ్ కు మరో ముప్పు పొంచి ఉన్నది. గత కొన్ని రోజులుగా ఆ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఈరోజు నుంచి ఆ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం, అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఇప్పటికే ముందస్తు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉండటంతో దిగువ ప్రాంతంలోని ప్రజలను తరలించారు. అంతేకాదు, బద్రీనాథ్ యాత్రను […]
తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అన్నాడీఎంకే 50 వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో చిన్నమ్మ శశికళ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. పార్టీ పగ్గాలు చేపట్టేందుకు అటు మాజీ ముఖ్యమంత్రులు పన్నీర్ సెల్వం, పళనీ స్వామి పోటీ పడుతున్నారు. ఇద్దరిలో ఎవరో ఒకరు పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీని నడిపించాలని చూస్తున్నారు. అయితే, ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించిన కేసులో జైలుకు వెళ్లి వచ్చిన శశికళ ఇప్పుడు మరలా రాజకీయాల్లో రాణించేందుకు […]
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు ఆ ప్రభుత్వాన్ని ప్రపంచదేశాలు గుర్తించలేదు. ప్రపంచ దేశాలు గుర్తించకపోవడంతో పాటుగా విదేశీ మారక ద్రవ్యనిల్వలను అమెరికా ఫ్రీజ్ చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ దిగుమతులు చేసుకోలేకపోతున్నది. దీంతో దేశంలో నిత్యవసర వస్తువుల ధరలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. తాలిబన్ ప్రభుత్వాన్ని గుర్తించకపోవడంతో దేశంలో ఐసిస్ ఉగ్రవాద సంస్థ యదేచ్చగా రెచ్చిపోతున్నది. కాందహార్, కుందుజ్ లలోని మసీదుల్లో ఐసిస్ ఉగ్రవాదులు బాంబుపేలుళ్లకు పాల్పడుతున్నాయి. ఈ ఘటనలలో వందలాది […]
లఖింపూర్ ఖేరీ ఘటనపై ఇంకా దేశంలో ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. రైతుల ర్యాలీపైకి కేంద్రమంత్రి కుమారుడు అశిశ్ మిశ్రా కాన్వాయ్‌లోని కారు దూసుకుపోవడంతో నలుగురు రైతులు మృతి చెందారు. ఆ తరువాత జరిగిన సంఘటనలో మరో ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అశిశ్ మిశ్రాను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ఘటనపై రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. ఆశిశ్ మిశ్రాతో పాటుగా కేంద్ర […]
చైనా మరోసారి ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది. అణ్వస్త్ర సామర్థ్యమున్న ఓ సరికోత్త హైపర్‌సోనిక్ క్షిపణిని పరీక్షించింది. ఈ క్షిపణి భూకక్ష్యకు దిగువున భూమి మొత్తాన్ని చుట్టేసి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. అయితే, చైనా ప్రయోగించిన ఈ క్షిపణి కొద్దిలో గురితప్పినప్పటికీ, అమెరికా కన్నుగప్పి ఈ క్షిపణిని ప్రయోగించింది. భూకక్ష్యకు దిగువున భూమి మొత్తం చుట్టేసి రావడం అంటే మాములు విషయం కాదు. ఈ హైపర్ సోనిక్ క్షిపణి అమెరికా మీద నుంచి కూడా ప్రయాణం చేసి ఉండవచ్చు. […]
ఉత్తరాఖండ్‌లో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొనడంతో ఆ రాష్ట్రం అప్రమత్తం అయింది. బద్రీనాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. బద్రీనాథ్ యాత్రకు వెళ్లే భక్తులు జోషిమఠ్, పాండుకేశ్వర్ వద్ద సురక్షితంగా ఉండాలని ప్రభుత్వం పేర్కొన్నది. ఇక చమోలీ జిల్లాలో రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అత్యవసరమైతే తప్పించి ప్రజలు బయటకు రావొద్దని జిల్లా అధికారులు పేర్కొన్నారు. గతేడాది చమోలీ జిల్లాలో పెద్ద ఎత్తున మంచు పెళ్లలు విరిగిపడటంతో […]
కేంద్ర మంత్రి అథవాలే ఈరోజు విశాఖలో పర్యటించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ తనకు మంచి మిత్రుడు అని, వైసీపీ కేంద్రంలోని ఎన్డీయేలో చేరాలని, కేంద్రం భాగస్వామ్యంతోనే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుందని, రోడ్లు, నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా ఏపీకి మేలు జరుగుతుందని కేంద్రమంత్రి పేర్కొన్నారు. ఇక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణతో ఎస్సీఎస్టీ రిజర్వేషన్లకు కొంత విఘాతం కలుగుతుందని, ఎలాంటి నష్టం జగకుండా ఉండేందుకు పార్లమెంటరీ కమిటీని సిఫార్సు చేశామని […]
ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక అక్కడ ప్రజల జీవనం అస్తవ్యస్తం అయింది. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఆహారం లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్టు తాలిబన్లను స్పూర్తిగా తీసుకొని మిగతా ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఆఫ్ఘన్‌లోని ఐసిస్ ఉగ్రవాద సంస్థ షియా ముస్లీంలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నది. కాందహార్, కుందుజ్ ప్రావిన్స్‌లో షియా ముస్లీంలు ప్రార్థనలు చేస్తున్న మసీదులపై దాడులకు పాల్పడింది. ఆ దాడుల్లో దాదాపుగా 160 మందికి పైగా ప్రజలు మృతి […]
టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు అంతరిక్షానికి సంబంధించిన దృశ్యాలను సెట్స్ వేసి తెరకెక్కించేవారు. కానీ, ఇప్పుడు ఈ దృశ్యాలను సెట్స్ మీద కాకుండా ఏకంగా అంతరిక్షంలోకి వెళ్లి చిత్రీకరిస్తున్నారు. రష్యా చిత్రం ది ఛాలెంజ్ సినిమాకు సంబంధించిన ఓ సీన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 12 రోజులపాటు షూట్ చేశారు. అంతరిక్ష కేంద్రంలో షూటింగ్ ను పూర్తి చేసుకున్న […]
స్మార్ట్ ఫోన్ లేకుంటే కొద్దిసేపు కూడా కాలం నడవదు. కరోనా కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే. ఇంట్లో కూరగాయల దగ్గరి నుంచి ఆఫీస్ మీటింగుల వరకు ప్రతిదీ కూడా స్మార్ట్ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అదే విధంగా స్మార్ట్ ఫోన్ వలన కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్‌లలోని యూజర్ డేటా ఆధారంగా కొంతమంది కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, కరోనా కాలంలో […]