కరీంనగర్ జిల్లాలో మద్యం అమ్మకాలు భారీగా సాగాయి. దసరా చివరి రోజు కారణంగా మద్యం అమ్మకాలు భారీగా జరిగాయి. రెండు రోజుల వ్యవధిలో జిల్లాలో 23 కోట్ల 20 లక్షల మేర మద్యం అమ్మకాలు జరిగినట్టు అధికారులు చెబుతున్నారు. దసరా ఫెస్టివల్, హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో అమ్మకాలు పెరిగినట్టు తెలుస్తోంది. హుజురాబాద్ నియోజక వర్గంలో మద్యం ఏరులై పారుతున్నది. మద్యం అమ్మకాలు 53 శాతం పెరిగనట్టు అధికారులు చెబుతున్నారు. వైన్ షాపుల వద్ద విపరీతమైన రద్దీ ఉంటోంది. హుజురాబాద్‌లో మద్యం స్టాక్ అయిపోవడంతో హన్మకొండ, హుస్నాబాద్, సిద్దిపేట నుంచి మద్యం తెప్పిస్తున్నారు.
Read: టీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ విడుదల…