టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఈ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈరోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి 22 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికల నామినేషన్లను స్వీకరిస్తారు. ఆ తరువాత, అక్టోబర్ 25 వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజున రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఉంటుంది. ఎంపిక అనంతరం, ప్లీనరీని నిర్వహిస్తారు. ఈ ప్లీనరీకి 13 వేల మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని పార్టీ ప్రకటించింది. హైటెక్స్‌లో ఈ ఎన్నికల నిర్వహాణ, ప్లీనరీ ఉంటుంది.
Read: భారీ ధరకు “అఖండ” రైట్స్ సొంతం చేసుకున్న దిల్ రాజు