బద్వేల్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 30 వ తేదీన బద్వేల్ ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ, బీజేపీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. ఈ ఉప ఎన్నిక సమయం దగ్గర పడుతుండటంతో పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీతో ఉన్న పొత్తులో భాగంగా జనసేన పార్టీ పోటీ చేయాల్సి ఉన్నప్పటికీ గత సంప్రదాయాలను గౌరవిస్తూ జనసేప పోటీ నుంచి తప్పుకున్నది. అటు తెలుగుదేశం పార్టీ కూడా ఉప ఎన్నిక నుంచి తప్పుకోవడంతో బీజేపీ పోటీకి దిగింది. ఇక ఇదిలా ఉంటే, బద్వేల్ ఉప ఎన్నిక సందర్భంగా నియోజక వర్గం పరిధిలో సెలవు ప్రకటిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బద్వేల్ నియోజక వర్గం పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
Read: పాతబస్తీలో మిలాద్ ఉన్ నబీ పండుగ శోభ…