నాసా త్వరలోనే చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపి అక్కడ పరిశోధనలు చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లను చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే అమెరికా చంద్రుడి మీదకు వ్యోమగాములను పంపింది. ఆ తరువాత, చంద్రమండల ప్రయాణాలను పక్కన పెట్టి అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి పరిశోధనలు చేస్తున్నారు. 2024 వరకు చంద్రుడి మీద కాలనీలు ఏర్పాటు చేయాలని నాసా ప్లాన్ చేస్తున్నది. దీనికి అవసరమైన సామాగ్రిని భూమి నుంచే చంద్రుడి మీదకు చేర్చాల్సి ఉంటుంది. ఇక, కాలనీలు ఏర్పాటు చేసినప్పటికి అక్కడి నుంచి ఎలాంటి సంకేతాలు కావాలను భూమిమీదకు పంపాలన్నా తప్పని సరిగా ఇంటర్నెట్ అవసరం అవుతుంది. దీనికోసం నాసా ఆస్ట్రోనాట్స్‌ను చంద్రుడి మీదకు పంపింది. అక్కడ వేడి వాతావరణం, దుమ్ము, ధూళి, రాళ్లు వంటి పొడి వాతావరణంను తట్టుకొని నెట్ వర్క్ పనిచేస్తుందా లేదా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నది నాసా.
Read: బద్వేల్ ఉప ఎన్నిక: సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం…