రోజు రోజుకు పెట్రోల్, డీజీల్ ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ రూ.100కు పైనే ఉంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరాల్లో బతుకు జీవుడా అంటూ జీవీతాలను గడిపే సామాన్యులు పెరిగిన ధరలపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ ముడి చమురు కంపెనీల్లో మార్పుల వల్ల దేశీయచమురు కంపెనీల ధరల్లో వ్యత్యాసాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.9 గా ఉండగా, డీజీల్ ధర103.18 గా ఉంది. నిత్యవసర ధరలు పెరిగి తీవ్ర ఆర్థిక భారంలో ఉన్న సామాన్యులకు, రోజు రోజుకు పెరుగుతున్న పెట్రో,డీజీల్ ధరలతో సతమతమవుతున్నారు. ఇదిలా ఉంటే ఆయా జిల్లాల్లో పెట్రో, డీజీల్ ధరల్లో స్వల్పంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పెరిగే ధరలతో సామాన్యుల జేబులకు చిల్లులు పడటం ఖాయం.