ఒలింపిక్స్ సమయంలో కరోనా మహమ్మారి జపాన్ దేశాన్ని వణికించేసింది. కొత్త కేసులతో వణికిపోయింది. ఎలాగోలా కరోనా సమయంలోనే ఒలింపిక్స్‌ను విజయవంతంగా నిర్వహించారు. ఒలింపిక్స్ ముగిసిన కొద్ది నెలల వ్యవధిలోనే కరోనా మహమ్మారిపై జపాన్ అతిపెద్ద విజయం సాధించింది. కరోనాను కట్టడి చేయడంతో విజయవంతం అయింది. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా వంటి దేశాల్లో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. అటు మరణాల సంఖ్య కూడా పెద్ద ఎత్తున పెరుగుతున్నది. అయితే, జపాన్‌లో అందుకు భిన్నంగా కేసులు కంట్రోల్ కావడం విశేషం. ఆగష్టు నెలాఖరు వరకు 25 శాతంగా ఉన్న పాజిటివిటి కేసులు, అక్టోబర్ మధ్యవరకు ఒక్కసారిగా పడిపోయాయి. అక్టోబర్ మధ్యనాటికి ఒకశాతానికి పడిపోయాయి. 45 రోజుల వ్యవధిలోనే కేసులు భారీగా తగ్గిపోవడం విశేషం. అగష్టు నెలలో కూడా రోజుకు20 వేలకు పైగా కేసులు నమోదవ్వగా, అక్టోబర్ మధ్యనాటికి ఆ కేసుల సంఖ్య 400 కి పడిపోయింది. ట్యోక్యో నగరంలో నగరంలో కేవలం 40 కేసులు మాత్రమే నమోదయ్యాయి అంటే ఆ దేశం కరోనా కట్టడికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చిందో అర్థం చేసుకోవచ్చు.
Read: అక్టోబర్ 19, మంగళవారం దినఫలాలు