మహ్మద్ ప్రవక్త జన్మదినం రోజును మిలాద్ ఉన్ నబీ గా జరుపుకుంటారు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పాతబస్తీలోని ప్రధానమైన రహదారుల్లో విద్యుత్ దీపాలతో అలంకరించారు. మిలాద్ ఉన్ నబీ కి ముందురోజే మసీదులు, మైదానాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేసి మహ్మద్ ప్రవక్త జీవిత విశేషాలను వివరిస్తారు. ఇక ఈరోజు ఉదయం నుంచి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా, మిలాద్ ఉన్ నబీ రోజున చార్మినార్ నుంచి మొఘల్ పురా ప్లే గ్రౌండ్ వరకు భారీ ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీ అనంతరం బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. ఈ పండుగ కోసం పాతబస్తీలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Read: విశాఖ ఉక్కు: 250 మందితో 25 గంటలు దీక్ష…