యాదాద్రి ఆలయం పునఃప్రారంభం కాబోతున్న తరుణంలో ఆలయంలోని విమాన గోపురం స్వర్ణమయం కాబోతున్నది. ఈ విమాన గోపురం స్వర్ణతాపడం కోసం అనేక మంది దాతలు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటిస్తున్నారు. ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కుమార్ 2కిలోల బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. సీఎం కేసీఆర్‌ను స్పూర్తిగా తీసుకొని అనేక మంది దాతలు బంగారాన్ని విరాళంగా ప్రకటిస్తున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కాసుమన్ కిలో బంగారం, జలవిహార్ ఎండీ కిలో బంగారం, హెటిరో గ్రూప్ 5 కిలోల బంగారం, మంత్రి మల్లారెడ్డి 2 కిలోలు, మర్రి జనార్థన్ రెడ్డి 2 కిలోలు, హరీష్‌రావు కిలో, కావేరీ సీడ్స్ కిలో, జీయర్ పీఠం కిలో, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కిలో, ఎమ్మెల్యే హనుమంతరావు కిలో, ఎమ్మల్యే కృష్ణారావు కిలో, కేవీ వివేకానంద కిలో చొప్పున బంగారాన్ని విరాళంగా ప్రకటించారు. రాజకీయ నాయకులతో పాటు, తెలుగు రాష్ట్రాల్లోని వ్యాపారవేత్తలు బంగారాన్ని విరాళంగా ప్రకటించారు.